Others

ధ్వంస ధ్వని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలను తాకి ఆలకించు
అపురూప నాదాలు
ధరణినాస్వాదించు
దాగి వుంది మమత
అందలాన్ని ఆహ్వానించు
అందించును పులకరింత
అగ్నిని ఆరాధించు
యజ్ఞమై మేల్కొలుపు
గాలిని శ్వాసించు
గాంధార్వమై పలుకు
ప్రకృతిలో వనరులన్నీ
పరహితమే కోరు
మానవుడికేమయంది
ఇంత దగాకోరు!
హద్దులు దాటిపోయె
అత్యాశా వికారాలకు
అవధులు కూలిపోయె
పంచభూత ప్రాకారాలకు
ఏ మతం నేర్పుతుంది
అంతులేని అనురాగం
‘ధ్వంస ధ్వనే’ నేడు
‘హంసధ్వని’ రాగం
మనిషి జనే్మ నీది
మరి మానవత్వమేదీ?

- మాయకుంట్ల నారాయణరెడ్డి, ఫోన్: 9989686603