Others

దత్తపుత్రిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మవడి కమ్మదనం పొందుతున్న
తరుణంలో మరో అమ్మ చేతికి అప్పగించిరి
ఆర్థిక భారమో ఆడపిల్లలని అలుసో
అద్దెబిడ్డను చేసిరి
ఏ తప్పు ఎరుగని నాకు ఇంత పెద్దశిక్షేటో
ఈ చిన్న మనసుకు అవగతం కాలేదు
నిత్యం కళ్లు చెమ్మగిల్లి కన్నీటితో ఒల్లుతడిచేది
అద్దెబిడ్డనైనా అక్కున చేర్చి లాలించెను ఈ తల్లి
నా అదృష్టమేనేమో ఆనందాల జీవితం గడిచింది
కాలం ముందుకెళ్తున్న తరుణం
ఈ అమ్మకూ ఓ బిడ్డ కలగగా
స్వంత బిడ్డ మీద మమకారం అద్దెబిడ్డ
మీద లేకపోయే
చేతికొచ్చిన బిడ్డ చేదోడు వాదోడుగా పడుంటుందని
వెట్టిచాకిరి చేయించే
ఎదుగుతున్న సొంతబిడ్డతో మురిసిపోతూ
అద్దెబిడ్డ కనరాకపోయే
కన్నతల్లి దరిచేరాలని అద్దెతల్లికి
తెలియకుండా పరుగులు తీస్తి
పడుతూ లేస్తూ అమ్మ దరి చేరితి
అప్పుడు తెలిసింది గుండె పగిలే వార్త
అమ్మకు అంటరాని రోగముందని అందుకే
నన్ను వేరే అమ్మ చేతిలో అప్పగించిందని
పుట్టుక నుండి గిట్టుక వరకు
ఆడపిల్ల జీవితం ప్రశ్నార్థకమేనా?

శివేగారి చిన్నికృష్ణ, ఫోన్: 6300318230