AADIVAVRAM - Others

‘మత్తు’ వీడితే.. ప్రపంచం మహాద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(గత సంచిక తరువాయి)
*
రెండేళ్లలోనే ప్లేగుతో అది కూడా మాయమైంది. పుట్టిన శిశువు కూడా త్వరలోనే పోయింది. శాంతి మరణంతో ఇతను పిచ్చివాడిలా తిరుగుతూండేవాడు. తరువాత మళ్లీ పెళ్లి మోక్షదాతో జరిగింది. ఈమెయే హిరణ్మయి. బాహ్యంగా కాకపోయినా అంతర్యంలో రూపవతి. ఒక పక్షిని కొడుకులా పెంచేవాడు. అది చనిపోయిన ఒక వికారమైన కుక్క ‘ఖేలీ’ని పెంచసాగాడు. తనకు వచ్చిన మిఠాయిని ఆ కుక్కకి పెట్టేవాడు. టీ తాగించేవాడు. దాని కోసం కోర్టుకి కూడా వెళ్లి, కుక్క కరిచిన వారికి డబ్బు ఇచ్చాడు. అది అతని రాతప్రతి ‘మాలిని’ పాడు చేసింది. 6 నెలల కష్టం కుక్కపాలు అయింది. అది మళ్లీ రాయలేదు. గృహ దహనంలో అతను గీసిన చిత్రాలు వ్రాతప్రతులు అన్నీ కళ్ల ముందే దగ్ధం అయ్యాయి. చరిత్ర హీనులు మళ్లీ రాశాడు కానీ మళ్లీ పెయింటింగ్ జోలికి వెళ్లలేదు. ‘స్ర్తిజాతి చరిత్ర’ బూడిద అయింది. 1912కే అతనికి గుండె జబ్బు వచ్చింది. అనిలాదేవి (అక్క) అనే మారుపేరుతో సమీక్షలు, వ్యాసాలు, ‘శరశ్చంద్ర ఛటోపాధ్యాయ’ అని తన పేరుతోనే చిన్న కథలు, ‘అనుపమాదేవి’ అనే మారు పేరుతో పెద్ద కథలు రాసేవాడు. పదనిర్దేశం (తెలుగులో తీరని కోరికలు) మొదలు రాసినప్పుడు హేమగుణేంద్రుల కలయికతో సుఖాంతం. కాని మిత్రుని వ్యాఖ్యపై ముగింపు మార్చాడు. ‘చరిత్రహీనులు’ పుస్తక ప్రచురణ ఒక దుమారం రేపింది. అందులో సురబాల, సావిత్రి నిజ జీవితంలో వ్యక్తులే! ఇంటి ముందుకు వచ్చి చరిత్ర హీనులు దగ్ధం చేసి వెళ్లిన సంఘటన కూడా ఉంది. ‘స్వామి’ నవలకు బ్లాంక్ చెక్కు పారితోషికం పంపారు. ఎంతో పేరున్నా శరత్ కేవలం వంద రూపాయలు ఆ చెక్కులో రాశాడు.
‘మత్తు లేనప్పుడు ప్రపంచం స్వచ్ఛంగా కనిపిస్తుంది. నల్లమందు తినకుంటే ఇంకా గొప్ప రచయితనయ్యే వాడిని’ అని మామతో వాపోయాడు. ‘బిజిలీ’ సంపాదకుడికి దసరా ప్రత్యేక సంచిక కోసం రచన వాగ్దానం చేశాడు. తిప్పించి చివరకు ‘అనివార్య కారణాల వల్ల రాయలేకపోతున్నా’ అని లేఖ రాశాడు. వారు ఆ లేఖనే వేసుకున్నారు. పోనీ వచ్చే సంవత్సరం వేసుకుందామంటే అవే కథలు, వాయిదాలు. అప్పుడు సంపాదకుడు నళినీబాబు ‘నాకు సంగీతం మాస్టారు ఉద్యోగానికి సిఫారసు చేయండి’ అని చెప్పి టాక్సీలో తీసికెళ్లి తన ఇంటిలో ఒక గదిలో బంధించి ‘పక్క గదిలో ఉంటాను. వ్యాసం పూర్తి కాగానే పిలవండి, తలుపులు చేరుస్తాను’ అన్నాడు. మూడు గంటల తర్వాత శరత్ ‘కొన్ని రోజులు భ్రమణ గాథ’ రాసి నవ్వుతూ వెళ్లిపోయాడు. కుక్క చనిపోయిన తరువాత మరీ ఒంటరి అయ్యాడు. 27.10.1926 తమ్ముడు (పూర్వాశ్రమంలో ప్రభాస్) సన్యాసంలో వేదానందుడు చనిపోయాడు. అంత్యక్రియలు శరత్ చేశాడు. మార్చి 1922 ‘మానవ ధర్మాన్ని సతీత్వం కన్నా చాలా గొప్పదిగా భావిస్తారు. సతీత్వం, స్ర్తిత్వం రెండూ ఆదర్శంలో సమానం కావు. స్ర్తి హృదయంలోని మంగళదాయకమైన కరుణ, పుట్టుకతో వచ్చిన మాతృవేదన సతీత్వంకన్నా చాలా గొప్పది. ఎందరో స్ర్తిలు పాతివ్రత్యం కలిగి కూడా చేయరాని పనులు చేశారు. ద్వేషం, సంకుచిత్వం, నీచం, అన్నీ వారిలో ఉన్నాయి. జారత్వం లేకున్నా అంతకు మించిన నీచాలున్నాయి. దీనికి భిన్నంగా పతితలైన స్ర్తిలలో మాతృహృదయం నిస్వార్థ మమత కరుణాసముద్రం పెల్లుబికినంత ఉన్నాయి’ అన్నాడు శరత్‌బాబు.
శరత్ సాహిత్య జీవితం 4 పర్వాలు, మొదటి పర్వంలో బడదీదీ, దేవదాసు, రెండవ పర్వంలో అతడు భావుకత్వంలోను సంవేదనలో మగ్గిన కాలం, పరిణీత, రాముని బుద్ధిమంతనం, చరిత్రహీనులు, శ్రీకాంత్ మొదలైనవి రాశాడు. 3వ పర్వంలో దత్తా, గృహ దహనం, నాల్గవ భాగం నవయుగం, శేషప్రశ్న ఈ కాలపు రచనే. ఇతను బతికి ఉండగా శుభద అచ్చు కానీలేదు. తన 22వ సంవత్సరంలో దీనిని రాశాడు. నిరుపమదేవికి మచ్చ తగులుతుందనా? దానిని కాల్చమని మేనల్లుడికి చెపితే, అతను కాల్చక, దాచి, వేరే బూడిద సాక్ష్యంగా చూపించాడు మామకి. లేకపోతే, ఇంకొక బృహత్క్థ అగ్నికి ఆహుతి అయ్యేది. ఇతను గాంధీకి సన్నిహితుడైనా, సుభాష్‌చంద్రబోస్‌ని బలపరిచేవాడు. 1926లో ‘వర్తమాన హిందూ ముస్లిం సమస్య’ అనే వ్యాసం దేశంలో సుడిగాలి రేపింది. శరత్ ‘నేను చాలామంది పతితులను ఎరుగుదును. కళ్ళారా వారిని చూశాను. వారిలో కనిపించిన కథావస్తువు గొప్పగొప్ప వారిలో కనిపించదు. ధర్మం, న్యాయం, త్యాగం, దయ, మోహం, ప్రేమ, మానవుల్లో ఉండే మంచితనమంతా వారిలో ఉంది. వాటి కొరత కనిపించలేదు. నాకు సంబంధించిన చరిత్రను దృష్టిలో పెట్టుకొని, ఆ వ్యామోహంతో నేను చూసిన యధార్థాన్ని స్వీకరించకపోతే, ఇంతకు మించిన అధర్మం మరొకటి ఉండదు. ఎవరూ పూర్తిగా కలుషితులు కారు. వారిలోనూ బాగుపడే అవకాశం ఉంది.
ఎవరో పాఠకుడు శరత్‌ను అడిగాడు. ‘అయ్యా మీ రచనలు అర్థమైనట్లు ఠాగూర్ రచనలు అర్థం కావెందుకు?’ అని. అప్పుడు శరత్ ఇలా సమాధానం చెప్పాడు. ‘నేను మీ కోసం రాస్తున్నాను. ఠాగూర్ మా కోసం రాస్తున్నారు.’ దేవదాసు నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు. ఇందులో నాయకుడు పలాయనవాది. నాయిక పార్వతిని కోల్పోవడమే కాక, తన జీవితాన్ని తాగుడు, వేశ్యలతో వ్యర్థం చేసుకున్నవాడు. అయితే ఇది శరత్ నవయవ్వన జీవనగాథ. తన విషాదానికి నవలా రూపం ఇచ్చాడు శరత్. ప్రతి నవలలో నాయకుడు అతని ప్రతిబింబమే!

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి