Others

సమగ్ర పరిశోధన అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక కాలంలో జరిగిన పలు ఆవిష్కరణలకు అసలు మూలాలు భారతీయ శాస్త్రాలలోనే ఉన్నాయని కొందరు నమ్ముతూ ప్రచారం చేస్తున్నారు. మన పూర్వీకులకు ఏమీ తెలియదని ఎవరూ చెప్పడం లేదు. ప్రాచీన భారతీయులు ఖగోళ, గణిత శాస్త్రంలో కొంత ప్రగతిని సాధించిన మాట వాస్తవమే. ఆధునిక శాస్తవ్రేత్తలు ధృవీకరించక ముందే మనం ధ్యానం, యోగాల ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకొనే ప్రయత్నం చేశాం. వనమూలికల ద్వారా వైద్యం చేసి కొన్ని రోగాలని నియంత్రించాం. గణితంలో సున్నాని ప్రపంచానికి పరిచయం చేశాం. మెగస్థనీస్ రచనల ప్రకారం మన దేశంలో బానిసత్వం లేదు. భారతీయులందరూ స్వేచ్ఛాజీవులని ఆయన వివరించారు. ఈ విషయానే్న ఏరియన్ అనే మరో గ్రీకు చరిత్రకారుడు ధృవీకరించాడు. నీటిపారుదల పద్ధతిలో మన వాళ్ళు గణనీయమైన ప్రగతి సాధించారు. అందుకు క్రీ.పూ.320లో నిర్మింపబడ్డ ‘సుదర్శన’అనే పేరుగల తటాకమే ప్రత్యక్ష ఉదాహరణ. తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలు ప్రపంచవ్యాప్తంగా పేరుపొందాయి. మహిళా సాధికారత కూడా మన దేశంలో వుంది. గణితంలో ఆర్యభట్ట భాస్కరాచార్య, బోధాయన, వైద్యంలో చఱకుడు, సుశ్రుతుడు చేసిన కృషి ప్రశంసించదగ్గదే. 1780వ ప్రాంతంలో టిప్పుసుల్తాన్ బ్రిటీష్ సైన్యాన్ని ఎదుర్కొనడానికి 2 కి.మీ. పరిధిలో ప్రయోగించగల రాకెట్స్ వాడారు. అయితే ప్రాచీన భారతదేశంలో సైన్స్‌పై జరిగిన కృషికి కొనసాగింపుగా మధ్య మరియు ఆధునిక కాలాలలో మన పాలకులు సైన్స్‌పై పరిశోధనలకు పెద్దగా ఊతం ఇవ్వలేదు. బ్రిటీష్‌వారు మన దేశంనుండి గుమస్తాలే రావాలన్నారు కానీ, శాస్తవ్రేత్తలని కాదు. స్వాతంత్య్రం అనంతరం ఒ దశాబ్దంవరకు మన దేశంలో పాఠశాలలో సైన్స్‌ని బోధించడానికి ఖచ్చితమైన నిబంధనలు లేవు. ఉన్నత విద్యలో కూడా జిల్లా కేంద్రాల్లో ఉన్న కళాశాలల్లో మాత్రమే సైన్స్ కోర్సులుండేవి. ఫలితంగా గ్రామీణ విద్యార్థులు చిన్నచిన్న పట్టణాలలో ఉన్న కళాశాలల్లో చేరి ఆర్ట్స్ కోర్సులు అభ్యసించేవారు. సైన్స్‌కి సంబంధించిన సమాచారం ప్రాంతీయ భాషల్లో లభించేదికాదు. సివిల్స్ సర్వీస్, గ్రూప్‌వన్ వంటి ఉన్నతస్థాయి ఉద్యోగార్థులు కూడా ఆర్ట్స్ సబ్జెక్టుని అభ్యసించి ఉద్యోగాలు పొందేవారు. ఫలితంగా మన దేశంలో నూతన ఆవిష్కరణలు తక్కువగా జరిగాయి. మన దేశంలో సైన్స్ పురోగతి ఈ విధంగా ఉండగా పాశ్చత్య దేశాల్లో మధ్యయుగంలోనే సైన్స్ పరిశోధనలు ఊపందుకున్నాయి. గెలీలియో, గియోనార్డోబ్రూనో, కోపర్నికస్ వంటి శాస్తవ్రేత్తలు మత పెద్దల్ని ఎదిరించో లేదా రహస్యంగానో పరిశోధనలు చేసి శాస్త్ర పరికల్పనలకు ఋజువురూపంలో ప్రాణంపోశారు. కణాదుని కణ సిద్ధాంతం పరికల్పనకే పరిమితం కాగా డాల్టన్ వంటివారు ప్రయోగాత్మకంగా నిరూపించారు. మన ఖగోళ పరిశోధనలు జ్యోతిష్యం శాస్త్రంగామారి నేటికీ చలామణి అవుతుండగా, పాశ్చాత్యులు చేసిన పరిశోధనలు ఖగోళ శాస్త్రాన్ని(ఆస్ట్రోనమీ) కాస్మాలజీ స్థాయికి పెంచాయి. మనమింకా చంద్రుడిని చూసి భయపడే స్థితిలోనే ఉండగా, పాశ్చాత్యులు చంద్రునిపై కాలుమోపారు. మన జ్యోతిష్కులు ఆకాశంలో మొత్తం నక్షత్రాలని 27గా తేల్చగా, విదేశీయులు కోట్లాది నక్షత్రాలున్నాయని నిర్ధారించారు.
మనకున్న ఘనమైన వారసత్వ సంపదలో అన్ని వర్గాలవారికి భాగస్వామ్యం ఉందని మనమంతా గుర్తించాలి. ప్రాచీన ఈజిప్ట్, మొసపటోమియా నాగరికతలతో పోల్చితే సింధూ నాగరికత గొప్పదని పలువురు చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ నాగరికత నిర్మాణంలో ఈ దేశ మూలవాసులైన ద్రావిడులకు కూడా భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు పాలకులు చేయాల్సిందొక్కటే. మన పూర్వీకులు ఊహించిన పరికల్పనలు, ప్రతిపాదించిన సిద్ధాంతాలు తాళపత్ర గ్రంథాల రూపాల్లో, శాసనాల రూపాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. వాటిపై సమగ్ర పరిశోధన చేసి ఆ సిద్ధాంతాలు ఆధునిక మానవుని అవసరాలకు పనికివస్తాయో లేదో పరిశీలించాలి. యోగా, ధ్యానాలని విదేశీయులు తమతమ వాతావరణ పరిస్థితులకనుగుణంగా మార్చుకొని సత్ఫలితాలు పొందుతున్నారు. ఇప్పటివరకు గొప్పగొప్ప నాయకులకు మాత్రమే కులాలు, వర్గాలని అంటగంటే ప్రయత్నంచేసారు. నవ భారతంలో రామాయణంలో శ్రీరాముడికి విధేయుడిగా చెప్పబడ్డ హనుమంతునికి కూడా కుల మతాలని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

- యం. రాంప్రదీప్