Others

ఒకప్పుడొక సైనికుడుండేవాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతడు
నిజం తుపాకీనే ధరించేవాడు

కళ్లల్లో
దయా, జాలీ కనబడకుండా
టోపీ ధరించేవాడు

ముఖంలో
నవ్వు కానరానియ్యకుండా
అడ్డంగా శిరస్త్రాణం పెట్టుకునేవాడు

తననెవరూ గమనించకుండా
చెట్లు పుట్టలలో కలిసిపోయే
బట్టలు వేసుకునేవాడు

గంటల తరబడి
ఊపిరి బిగబట్టి
స్వేదాన్నీ, రక్తాన్నీ ప్రవహించకుండా ఆపేసేవాడు

ఎండనకా, వాననకా
కొండల్లో, గుట్టల్లో
రేయా పగలూ...
పోరాటానికి సన్నద్ధంగా ఉండేవాడు..

అతడికి కాలం
ఘనీభవించి ఉంటుందెపుడూ
అతడికి
కుటుంబం అంటే దేశం మొత్తం!

తను చేసిచ్చిన
కాగితప్పడవ ఇంకా పిల్లలు దాచిపెట్టారనీ
తనతో గడిపిన క్షణాల్ని
సగభాగం మళ్లీ మళ్లీ నెమరేసి చూసుకుంటుందనీ
వాళ్లందరికీ తను మాత్రమే లోకమనీ...
తెలియదా అతడికి?

తెలిసినా
ఇప్పుడది అప్రస్తుతం
అతడిక గతం...

ఇప్పుడు
అందరూ చెప్పుకుంటున్నారు
ఒకప్పుడు
ఇక్కడొక సైనికుండేవాడు... అని!

- గీతా వెల్లంకి