Others

ఈ ఓటమి ఇంకెంత కాలం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2019 ఫిబ్రవరి 14వ తేదీ మధ్యాహ్నం 3.15 గంటలకు జమ్మూనుండి శ్రీనగర్ వెళ్తూ పుల్వామా ప్రాంతం జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ‘సి.ఆర్.పి.ఎఫ్’ ట్రక్కులపై పాకిస్తాన్ తీవ్రవాది హఫీస్ సయ్యద్ ద్వారా శిక్షణ పొందిన కాశ్మీర్ యువకుడు ఆత్మాహుతికి సిద్ధపడి ‘‘200 కిలోల ఆర్‌డిఎక్స్’’ గల వాహనం ద్వారా దాడి చేయడంవల్ల దేశభక్తులైన దేశరక్షకులు 40 మంది జవానులు బలయ్యారు. అనేకమంది జవానులు క్షతగాత్రులైనారు.
‘ఉరి’పై దాడిచేసిన తీవ్రవాదులను మట్టుబెట్టుటకు ‘సర్జికల్ స్ట్రైక్’ చేస్తే, దాడి చేసినట్లు ఆధారాలు చూపగలరా? అని రాహుల్‌గాంధీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. తీవ్రవాదులకు మతముండదని చెప్పే కాంగ్రెస్, కమ్యూనిస్టులు ‘ఉరి’పై ‘పుల్వామా’పై దాడిచేసిన వారు ఒకే మతానికి చెందిన వారు కాదా? ఆ మతస్తులే మళ్ళీ భారతదేశంపై దాడి చేయవలసిన అవసరమేమున్నదో చెప్పగలరా? స్వాతంత్య్రం వచ్చిన సమయంలో 556 సంస్థానాలు ఇండియన్ యూనియన్‌లో కలిసిన నాటినుండి సమస్యలేదు. కానీ జమ్మూకాశ్మీర్ ప్రాంతం నుండి ప్రారంభం నుండే సమస్యల వలయంగా మారింది. ఆనాడే కాశ్మీర్ మూడవవంతు భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకొన్నది. ఇది ఆనాటి పెద్దమనుషుల అసమర్థత, బాధ్యతారాహిత్యం కాదా?
1971లో పాకిస్తాన్‌తో యుద్ధం చేసి బంగ్లాదేశ్‌ను ఏర్పాటు చేసి విజయం సాధించినట్లు చెప్పకుంటున్నాము. కానీ పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ భూభాగాన్ని ఎందుకు విముక్తి చేయలేకపోతున్నామో ఆలోచించవలసియున్నది. పాకిస్తాన్ ‘ఆక్రమిత కాశ్మీర్‌ను విముక్తి’ చేయనంతకాలం మన దేశం ఎన్నిసార్లు పాకిస్తాన్‌పై విజయం సాధించినా, ఎంతమంది తీవ్రవాదులను మట్టుబెట్టినా, ఎన్నిసార్లు మంతనాలు జరిపినా చేతులు కాల్చుకోవడం తప్ప సాధించేది ఏమీ లేకపోతున్నది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి అమలౌతున్న 370 ఆర్టికల్ రద్దుచేసి మిగతా రాష్ట్రాల మాదిరిగా 5 సంవత్సరాలకొకసారి అసెంబ్లీ ఎన్నికలు జరుపనంతకాలం జమ్మూకాశ్మీర్ ప్రజలలో వేర్పాటువాదులు జమ్మూకాశ్మీర్ స్వతంత్రం కావాలనే విషం నింపుతూనే వుంటారు. దాడులు చేసే వారికి నిరంతరం అండదండలు అందిస్తూనే ఉంటారు. పాకిస్తాన్ తీవ్రవాదులతోపాటు జమ్మూకాశ్మీర్‌లోని వేర్పాటువాదులను, వారిని కౌగిలించుకొనే కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్, పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్ళి ఆక్రమిత కాశ్మీర్ అధ్యక్షుని ప్రక్కన కూర్చొని, పాకిస్తాన్ మిలిటరీ చీఫ్‌ను కౌగిలించుకొని పాకిస్తాన్ జిందాబాద్ అన్న ‘నవజ్యోతి సిద్దూ’ లాంటి వారు, పాకిస్తాన్ చర్యలను సమర్థించే మహబూబా ముఫ్తీ లాంటి రాజకీయ నాయకులు భారత్‌లో ఉన్నంతకాలం భారత సైనికులు కనురెప్ప వాల్చలేరు. బలిదానాలు కొనసాగుతూనే ఉంటాయి.
జెఎన్‌యు, ఏఎమ్‌యు లాంటి విద్యాలయాలలో తయారవుతున్నా విద్యావంతులనబడే తుకుడే తుకుడే గ్యాంగులనంతమొందించనంత కాలం తీవ్రవాదులకు మనోబలం పెరుగుతూనే ఉంటుంది. వారి కార్యకలాపాలు కొనసాగుటకు అవకాశాలు అందుతూనే ఉంటాయి.
పాకిస్తాన్ నుండి చొరబాటుదారులను అడ్డుకొనుటకు భారతదేశం సరిహద్దు ప్రాంతంలో కొత్తకొత్త టెక్నాలజీ భద్రత, అధిక సంఖ్యలో సైనికులు, సైనికుల రక్షణకు బులెట్‌ప్రూఫ్ జాకెట్లు, శక్తివంతమైన వెపెన్స్ అందించినప్పటికీ, కనురెప్ప వాల్చని సైనికులు రక్షణ కొనసాగుతున్నప్పటికీ ప్రతినిత్యం తీవ్రవాదులను ఎదుర్కొనక తప్పటం లేదు. ప్రతిరోజు 4, 5, 6 మంది చొప్పున తీవ్రవాదులనంతమొందిస్తున్న సైనికులు ఒకే పర్యాయం 40 మంది సైనికులు బలిదానం కావల్సి వచ్చింది. కానీ పాకిస్తాన్ దృష్టిలో మూల్యం చెల్లించినట్లు భావిస్తున్నారు. ఇది రాక్షసత్వానికి పరాకాష్ట. భారత ప్రభుత్వానికి సవాల్.
పాకిస్తాన్ మనతో యుద్ధం చేసిన ప్రతిసారి విజయం భారత్‌దే! పాకిస్తాన్‌ను రెండుముక్కలు చేసి బంగ్లాదేశ్ అనబడే ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసిన ఘనత భారతదేశానిదే! ఈ విషయాలు చెప్పుకోడానికే తప్ప నష్టాన్ని చేకూర్చినవే. ఆనాటి బంగ్లాదేశ్‌లో 28 శాతం హిందువులు ఈనాడు 8 శాతానికి పడిపోయారు. లక్షల సంఖ్యలో బంగ్లాదేశ్ ముస్లింలు మన భూభాగాలను ఆక్రమించుకొని స్థానికులను మైనారిటీలుగా మిగల్చడంతోబాటు, వారి భూములను, వ్యాపారాలను లాగేసుకున్నారు. రాజకీయంగా ఒక పార్టీకి మద్దతిస్తూ రాజకీయంగా బలపడుతున్నారు. బంగ్లాదేశ్‌లోని వేల సంఖ్యలోగల హిందూ దేవాలయాలు నేలమట్టం కాబడ్డాయి.
స్వాతంత్య్రం వచ్చి దేశం రెండుముక్కలుగా ఏర్పడ్డాక భారత భూభాగంలో అంతర్భాగమైన కాశ్మీర్ భూభాగంలో 3వ వంతు భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకొంటే అట్టి భూభాగంలో చైనావారు రోడ్లు, వివిధ రకాలైన నిర్మాణాలు చేసుకొనుటకు పాకిస్తాన్ చైనావారికి ధారాదత్తం చేస్తున్నారు.
అలాంటి ఆక్రమిత కాశ్మీర్ భూభాగము పాకిస్తాన్‌కు విజయచిహ్నంగా భారత్ ఓటమికి చిహ్నంగా ఉన్నంతకాలం భారత్ పాకిస్తాన్‌పై ఎన్ని విజయాలు సాధించినా చైనా ఆక్రమిత కాశ్మీర్ భారత్ అవమానానికి చిహ్నంగానే ఉంటుంది. భారత్‌లోని జమ్మూకాశ్మీర్‌లో ఏర్పాటువాదుల గళం నిరంతరం భారత్ ముర్దాబాద్, పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదం కొనసాగుతూనే ఉంటుంది.
1948లో కాశ్మీర్ భూభాగాన్ని పాకిస్తాన్ ఏవిధంగా ఆక్రమించుకొన్నదో అదే పద్ధతిలో ఆ భూభాగాన్ని భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవాలి. కానీ ఐక్యరాజ్యసమితి చేసే పరిష్కారానికి ఎదురుచూడడం నూట ముప్పై కోట్ల ప్రజల అసమర్థతగానే భావించాలి. ఎందుకంటే ఆజాద్ కాశ్మీర్ అనే భూభాగం పాకిస్తాన్ ఆక్రమించుకొన్నదే కాబట్టి ఉభయ దేశాలు మంతనాలతో పరిష్కరించుకోవలసినది కానేకాదు. భారత్ బలప్రయోగం ద్వారా స్వాధీనం చేసుకోవడమే ధర్మబద్ధమైనది. ఇందులో ఏ దేశం కూడా భారత్ చర్యను తప్పుబట్టడానికి ఆస్కారం లేదు. మత ప్రాతిపదికన దేశం విభజన జరిగిన సమయంలో ఆయా దేశాలు మైనారిటీలు ఆయా దేశాలలో ఉండవచ్చు. వారి సంరక్షణ ఆయా దేశాల వారిదే అన్న ఆనాటి పెద్దమనుషుల సోది భారతదేశం మాత్రమే గౌరవిస్తుంది తప్ప పాకిస్తాన్, బంగ్లాదేశీయులకు పట్టదు. ఆనాడు పాకిస్తాన్‌లో 22 శాతం, బంగ్లాదేశ్‌లో 28 శాతం అల్పసంఖ్యాకులు ఉండేవారు. ఈనాడు 1 శాతం, 8 శాతానికి పడిపోగా ఆనాడు భారత్‌లోని ముస్లింలు 7 శాతం ఉండగా ఈనాడు దాదాపు 18శాతానికి వృద్ధి చెందినదనే విషయాన్ని యావత్ భారత ప్రజలు గుర్తించాలి. వీటికిగల కారణాలను దేశ ప్రజలు ప్రభుత్వాలను ప్రశ్నించాలి. అమీర్‌ఖాన్, నసీరుద్దీన్‌షా లాంటి వాళ్ళు వేల కోట్ల ఆస్తులను సంపాదించినా, లక్షల మంది అభిమానులను చూరగొన్నా పాకిస్తాన్ తొత్తులుగా మారి భారతదేశంలో మాకు భద్రత లేదంటూ భారత ప్రభుత్వాన్ని హైజాక్ చేయుట, 130 కోట్ల భారతీయులను అవమానిస్తున్న ఇలాంటి వారికి తగిన బుద్ధిచెప్పాల్సిన అవసరం భారత ప్రజలదే.
దేశ భద్రత కాపాడుట విషయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను స్వాధీనం చేసికొనుట, ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాత్రమే దౌత్యపరంగానూ, సాహసోపేతమైన కఠిన నిర్ణయాలు తీసుకోగలదని దేశ ప్రజల ప్రగాఢ విశ్వాసం. తిరిగి రెండవసారి నరేంద్రమోడీని భారత ప్రధానమంత్రిగా ఎన్నుకోబడితేనే దేశం రక్షింపబడుతుందని 130కోట్ల భారతీయుల విశ్వాసం.

-బలుసా జగతయ్య.. 90004 43379