Others

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ వ్యూహాత్మక అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాబోయే పార్లమెంట్ కాంగ్రెసేతర బీజేపీయేతర పక్షాన్ని అధికారంలోకి తీసుకురావడానికి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ యాత్ర చేపట్టడం వర్తమాన రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది. 17 సీట్లు కలిగిన తెలంగాణ రాష్ట్రం జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం సాధ్యమవుతుందా? కేసీఆర్ వ్యూహమేమిటి? కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయం సాధించడంలో ఆయన సఫలీకృతులవుతారా? ఏమి జరగబోతోంది అన్నది కొన్ని నెలల్లో తెలిసిపోతుంది.
జాతీయ స్థాయిలో టి.ఆర్.ఎస్. పార్టీ తన పాత్రను క్రియాశీలకంగా పోషించాలని కీలకంగా రాణించాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కావడానికి ఆయన వ్యూహాత్మకంగా కదులుతున్నారు. కేసీఆర్ తెలంగాణకే పరిమితమైన రాజకీయ నాయకుడు కాదు దేశ రాజకీయాలను, వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను దేశంలో వివిధ పార్టీల స్థితిగతులను చక్కగా అంచనా వేయగలిగిన నాయకుడు కేసీఆర్.
ఇటీవల దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన తెలంగాణ ఎన్నికల ఫలితంపైనే జాతీయ స్థాయి మీడియా ఎక్కువ దృష్టి సారించింది. అనుమానాలన్నింటిని పటాపంచలు చేస్తూ కేసీఆర్ సాధించిన ఘనవిజయం రాజకీయ విశే్లషకుల్ని పండితుల్నే కాదు, టి.ఆర్..ఎస్. క్యాడర్‌ను కూడా సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎనిమిదిసార్లు శాసనసభకు అయిదుసార్లు లోక్‌సభకు ఎన్నికై రికార్డు సృష్టించారు. కేసీఆర్‌కు మాత్రమే ఈ విజయాలు ఎలా సాధ్యమవుతున్నాయి అంటే ఆయన పట్టుదల, విశ్వసనీయత, ఏదైనా సాధిస్తారనే నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుపోవడమే ప్రధాన కారణం.
అనేక అవమానాలు, సందేహాలమధ్య గుప్పెడు మందితో 2001 ఏప్రిల్ 27న ప్రారంభమైన గులాబీ పార్టీ నేడు తెలంగాణలో అతి పెద్ద పార్టీగా మరోసారి అధికారం దక్కించుకోవడం ఆశ్చర్యమే!
ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించి ఉప ప్రాంతీయ పార్టీగా తెలంగాణలో కొన్ని జిల్లాలు, కొంత ప్రాంతానికే పరిమితం అన్న విమర్శలు ఎదుర్కొన్న పార్టీ నేడు ముందస్తు అడుగులు వేస్తూ జాతీయ ప్రధాన పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేయడం అద్భుతమే!
2001లో అప్పటి డిప్యూటీ స్పీకర్‌గా వున్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ సంస్థను రాజకీయ పార్టీగా ప్రకటించిన నాటినుంచి నేటివరకు పార్టీలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని పరిణామాలు సంభవించినా మొత్తంగా టి.ఆర్.ఎస్. పార్టీ దుకాణం బంద్ చేయించాలనే కుట్రలు జరిగినా ఇంతింతై వటుడింతై అన్నట్లుగా అంచెలంచెలుగా ఎదుగుతూ అప్రతిహతంగా కొనసాగడం అభినందించాల్సిందే!
కేవలం ఇద్దరు పార్లమెంట్ సభ్యులు వున్న పార్టీ కేంద్ర ప్రభుత్వంలో చలనం తీసుకువచ్చి రాష్ట్రాన్ని సాధించడం, సాధించుకున్న రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తు లేకుండా ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటుచేయడం ఒక సంచలనమే!
అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు త్రాగించడం, రాజకీయ కోణంలో ఆలోచిస్తూ తలసాని, తుమ్మలతోపాటు టి.డి.పి., వై.ఎస్.ఆర్.సి.పి., శాసనసభ్యులను పార్లమెంట్ సభ్యులను చేర్చుకుని ఆ పార్టీలకు వాయిస్ లేకుండా చేయడం కేసీఆర్ రాజకీయ చతురతను తెలియజేస్తుంది.
సంక్షేమ పథకాల పేరిట సబ్బండ జాతులకు దగ్గరయ్యే ప్రయత్నంలో సఫలీకృతులయ్యారు. ముందస్తు వ్యూహంతో పక్కా ప్రణాళికతో ఎన్నికల్లో మరోసారి అధికారం సాధించి తన సత్తాను చాటారు. రాజకీయ పార్టీ ఎలాగైనా విజయం సాధించాలనుకొంటుంది. దానికోసం ఎన్ని ఎత్తుగడలైనా వేస్తుంది. తన బలాన్ని బలగాన్ని ప్రదర్శించడమే కాకుండా ఎదుటివారి లోపాల్ని పసిగట్టి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది.
తెలంగాణ ఏర్పడిన తరువాత తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ప్రజలకు చేరువయ్యే విధంగా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 2014 తరువాత జరిగిన ప్రతి ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చారు. పార్టీని పెంచాలి, విస్తరించాలనే ఆలోచనతో ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఆయన సాధించిన విజయాల నుండి రాజకీయ పార్టీలు చూసి నేర్చుకోవాలి. ప్రతిపక్ష పార్టీలు కూటమి కట్టి, క్షేత్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని ఎంతో ప్రచారం చేసినా ఆయన పార్టీ సాధించిన సీట్లు ఓట్లలో సగం కూడా సాధించలేకపోయారు.
తెలంగాణలో తన పార్టీకి సుస్థిరతను సాధించడం తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ స్థాయిలో అధికారంలోకి రాకుండా నిలువరించడం ఆయన ప్రధాన వ్యూహంగా తోస్తుంది.
రాజకీయ నాయకుడు తన అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే గతం, వర్తమాన పరిస్థితులే కాదు భవిష్యత్ పరిణామాన్ని పసిగట్టి అందుకు అనుగుణంగా వ్యూహాల్ని రచించాలి. ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టే వరస విజయాలు కేసీఆర్ సొంతమవుతున్నాయి.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెరాస ఎన్ని సీట్లు సాధిస్తుందో ఇప్పుడే చెప్పలేము కాని రాబోయే జాతీయ ప్రభుత్వంలో కేసీఆర్ మాత్రం కీలక పాత్ర పోషిస్తారని చెప్పవచ్చు.

- సురేష్ కాలేరు