Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిజాత పుష్పమ్ముల కోరుకొనియె మీ సత్యయొ!
పారిజాతవౌచు సీత నాథున కర్పించుకొనియె!

ఎవ్వరంచు రాముడనిన - ఎంచినారు మీరు?
అవనిపైన దిగిన యట్టి-ఆదిత్యుండాతడు!

రాముండన యుగపురుషుడు-సీత జగజ్జనని
ఆదర్శం వారి జంట యుగయుగాలకైన

కృష్ణపత్నులు:
శ్రీకృష్ణుడు కూడ దేవుడందురు వినలేదే?
శ్రీకృష్ణుడు యుగపురుషుండనగా కనలేదే?

అతనికి మీకును పోలిక లేవేవో తెలుపుడి!
అతనికి మీకును భేదమ్మేదో వివరించుడి!

శ్రీకృష్ణుడు:
దేవుడనగ ఎవరు సుమీ? మానవుడే మాధవుండు!
అవతారమ్మనగనేమి? అవనిని కాలిడుటే!

తారలు భువిపైకి దిగును- దిగును సూర్యకిరణం!
చంద్రుడైన చంద్రికతో - సల్పు జగతి విహారం!

అంబుధియే అంబుదమై పైకెగురును గానీ
ఆపైనను కాలుమోప- అవనియె ఆధారం
ఇంకావుంది...

-గన్ను కృష్ణమూర్తి.. 9247227087