Others

జైహింద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశవిభజన వేళ విషబీజాలన్నీ
అటువైపే వెదజల్లబడ్డాయి..
ధర్మ బద్ధమైన యుద్ధంలో అపజయమేనని
అర్థమయ్యాక వాటికి పోషకాలు లభించి
పెనువృక్షాలై నిలబడ్డాయి..
కర్కశమైన క్రూరమృగాలకు
అవి ఆసరాగా కనబడ్డాయి..
దొంగతనంగా కంచె దాటుతూ
పవిత్ర భారతావనిపై విషం చిమ్ముతున్నాయి..
అందమైన కాశ్మీరాన్ని అల్లకల్లోలం చేస్తూ
వికటాట్టహాసం చేస్తున్నాయి..
తెల్లని మంచుదిబ్బలపై
ఎర్రరంగును పూస్తున్నాయి..
భారతావనికి శిరోవేదన కలిగిస్తున్నాయి..
సహనాన్ని అసమర్థతగా అవహేళన చేస్తున్నాయి..
పుల్వామాలో నేలకొరిగిన వీరసైనికులు
నూట పాతిక కోట్ల భారతావనికి ప్రతినిధులు
పిరికిపందల దొంగదెబ్బకు ప్రాణాలర్పించిన త్యాగనిధులు
మీ రక్తం వృథాకాదు..
మీ శౌర్యం ఇంకిపోదు..
అశేషమైన భారత సైనిక పటాలమా..!
ఆఖండ భారతావని మీ వెంటే ఉంది..
ముఖ్యంగా ధర్మం మనవైపే ఉంది..
జయం మనదే!
జైహింద్..

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949