Others

తెలుగు తీయదనము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుడమితల్లిని తాకిన
ఉషోదయపు
బాలభాస్కరుని
అరుణకిరణ
నునువెచ్చని స్పర్శ..
వేకువజామున
చెట్టూకొమ్మలుగా
పక్షుల కిలకిలారావములు
కోకిల కుహుకుహుగాణము..
మాతృమూర్తి ఒడిలో
ఒదిగిన శిశువు
పెదవులపై విరసిన
లేలేత చిరు దరహాసము..
తరువులుగా
విరబూసిన పూల
సుగంధపరిమళాలు..
బడి వేళ
పిల్లల ప్రార్థనాగీతాల
గల మాధుర్యాలు..
జలతరంగమై
రైతురాజు నేలతల్లికి
ఆకుపచ్చని చీరను
వడుకుతు పాడిన
పల్లె సుద్దుల
పాటల పరవశము..
చినుకుల తడిపలుకరింపునకు
మట్టిరూపాలు వెదజల్లిన
సుగంధ పరిమళాలు..
సాయం సంధ్యలో
ఆలమందల అరుపులు
తమ ఇంటిజాడకై..
కొండాకోనలు చుట్టి
హొయలుబోతున్న
నదీమతల్లుల వయ్యారాలు..
నిండుపున్నమి వెనె్నలలుగా
ఆకాశదీపమై తలుకులీనుతున్న
జాబిల్లి..
ఇంకా ఇంకా
మాతృభాష
తెలుగు తీయదనము
సుందరము సుమధురము
ఆ పాతమధురము
అనంతము
అజరామరము!

- మడిపల్లి హరిహరనాథ్ 96035 77655