Others

పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగురంగుల బొమ్మల కోసం
పసికూనలు ముచ్చటపడతారు
చేతికందితే మురిపెంగా స్పృశిస్తారు
కేరింతలు కొడతారు

బహుమతులన్నా కానుకలన్నా
నజరానాలన్నా పురస్కారాలన్నా
అందజేసే వారుండాలే కాని
అందుకోవడంలో అయష్టత
అతి తక్కువమందిలోనే
తమకున్న అర్హతేమిటని
ఆలోచించేవారు తక్కువే...
చిన్నా పెద్దా తేడాల్లేక
తాయలాల కోసం ఒకటే పరుగు
ఎవరికైనా మొక్కేందుకైనా
అందలాలు అధిరోహించి
ఎక్కిన మెట్లు అతి తేలికగా మరవడంలోనైనా
అందరిలోకి ముందువరసలోనే

ప్రతిభ వున్న చోట
ప్రలోభం అవసరమా? అనివార్యమా?
జీవన సాఫల్యమని మరొకటని
గుర్తించేవారి స్థాయ మాటో...?

గుర్తింపులు గౌరవాలు
చేసే సేవలకు నిస్సందేహంగా
ప్రోత్సాహకాలే స్ఫూర్తిదాయకాలే
పన్నీటి సువాసనలు
దాహం తీర్చలేవని తెలిస్తే చాలు
సిరిసంపదలకు అతీతంగా
అనేకులు తనని తమవాడుగా
చెప్పుకునే తీరు కన్నా సంతృప్తి
మరేముంటుంది?
ఇంకెందులో వుంటుంది?

- డా. కొల్లు రంగారావు, 9866266740