Others

మల్లెతీగ కథల పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరిగపూడి పూర్ణచంద్రరావు స్మారకార్థం లయన్ డా. అరిగపూడి విజయకుమార్ సౌజన్యంతో ‘మల్లెతీగ’ కథల పోటీ నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు కలిమిశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీకి రొటీన్ కథలకు భిన్నంగా మన సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యల్ని చక్కటి శిల్పం, కథనాలతో తెలుగువారి జీవన సంస్కృతిని ప్రతిబింబించే కథల్ని ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో కథకు రూ.5000 చొప్పున ఎనిమిది కథలను ఎంపిక చేస్తామని, కథకు రూ.1000 చొప్పున పది కథలను ఎంపిక చేయనున్నట్లు నిర్వహకులు తెలిపారు. తెలుగు రచయతలు, రచయత్రులు ప్రాంతాలకతీతంగా ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఆసక్తి గల రచయతలు తమ కథల్ని ‘మల్లెతీగ కథల పోటీ, మల్లెతీగ, 41-20/3-24, మన్నవవారి వీధి, కృష్ణలంక, విజయవాడ - 520013’ అనే చిరునామాకు మార్చి 22వ తేదీలోగా పంపించాలి. మరిన్ని వివరాలకు 9246415150, 8332903156 నెంబర్లలో సంప్రదించవచ్చు.