Others

వాట్సప్ కవితా ప్రసారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ కవికైనా తాను వ్రాసిన కవిత్వాన్ని నలుగురికి చూపించాలనీ, పదిమందికి వినిపించి ఆనందింపజేసి అభినందనలు అందుకోవాలనే తపన సహజంగా ఉంటుంది. కానీ గతంలో కవి పుంగవులందరికీ అన్ని వేళల్లోనూ ఇది సాధ్యం కాక ఇబ్బందులు పడుతుండేవాళ్ళు నేడు సోషల్ మీడియా పుణ్యమా అని ఆ ఇబ్బంది కొంత తొలగినట్లుంది. కారణం చాలా కవితా సమూహాలు వాట్సప్‌లో ప్రారంభం కావడం. దీనివల్ల పాఠకులకు కూడా చాలా ఇబ్బందులు తొలగిన మాట వాస్తవం. మంచి కవిత్వాన్ని వినేందుకు, ఆస్వాదించేందుకు ప్రజెలెప్పుడూ సంసిద్ధులుగానే ఉంటారు. అసలు పేచీ అకవిత్వంతోనూ, పులుముడుతోనే! (బేతవోలు గారన్నట్లు). ఈ ఇబ్బంది ఎలా ప్రజలకు తొలగిందని అంటారా! ‘వాట్సప్’లో ఎవరైనా కవిత్వం పెట్టారనుకోండి. దాని ఇష్టముంటే చదువుతాం - లేకుంటే మానేస్తాం. పేచీ లేని పని. చదువుతున్నప్పుడు మన హావభావాలు కవికి తెలిసే అవకాశం లేదు. మరో ముఖ్యమైన సౌలభ్యం - తన కవిత్వాన్ని ఇంతమంది చదివారని ఇన్ఫోలో చూసుకుని మురిసిపోయే ఆత్మసంతృప్తి కవికీ మిగులుతుంది.
ఒకప్పుడేమిటి - ఇప్పుడు కూడా కవి సమ్మేళనానికి వెళ్తే అన్ని కవితలనూ చచ్చినట్టు వినాల్సిందే మరి! వాట్సప్‌లోనూ నచ్చని కవితను వదిలేసి మరో కవితకో, పద్యానికో వెళ్లే సౌకర్యం ఉండదు కదా! నచ్చితే పదిసార్లు విని, నచ్చకపోతే వెంటనే డిలీట్ చేసే సౌకర్యమూ మృగ్యం. అందుకే ఆలోచించగా... చించగా... ప్రత్యక్ష కవితా ప్రసారం కన్నా వాట్సప్ కవితా ప్రసారమే ఉభయతారకం. సర్వత్రా శ్రేయోదాయకం.

- డీవీఎం సత్యనారాయణ 9885846949