Others

రాజ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చట పొగమంచు
తొలగిపోలేదు
ఇంటినుండి
తీసుకెళ్లిన అనుభూతులు
మంచుతెరల్లో మునక
శకటం దూసుకొచ్చి
ఢీ
బావుకునేదేమిటో
చస్తూ
మరో చావుని రుచి చూస్తూ
స్వాతంత్య్రమా అది
ఉన్మాదమా అది
మతమేలే మనసులో
నింపే మూర్ఖత్వం
ఎండా అజెండా
అసమానతల తీరుతెన్నులు
రూపుమాపే తీరే కానరాక
భూతల స్వర్గంలో
నరకం రాజ్యం
రాజొకరు
రాజ్యం నిండి మరొకరు
ఎవరి అభిప్రాయం ఎవరికీ అక్కర్లేదు
జాతీయమో అంతర్జాతీయమో
అన్ని వేదికల నిండా అదే పాట
మోగి మోగి అరిగి పోతున్నా
అంగుళమూ కదలని పరిష్కారం
చావులు కళేబరాలు
గుండ్లు పేల్తాయి
బాంబులు పేల్తాయి
బతుకుతూ చచ్చేదెంతమందో
చస్తూ బతికేదెంత మందో
పాలన మొక్కుబడి
ప్రజాస్వామ్యం మూర్చొచ్చి ముక్కుతూ
మూలుగుతోంది
శవాల కుప్పల్లో
జాతీయ భావన గుప్పుమంటోంది
నడతలో నడకలో నయవంచన ఏళ్లుగా
జనం నోళ్లల్లో భావం
పిడచకట్టుకుపోతోంది

- గిరిప్రసాద్ చెలమల్లు 9493388201