Others

అందానికి వనె్న ఆనందమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వయసు ఒక అంకె మాత్రమే, అందానికి ఇంకా ఆనందానికి ఎప్పుడూ అది ఆనకట్ట కాదు అని మనకి నిరూపిస్తున్నాడు సూపర్‌స్టార్ రజనీకాంత్. ఇప్పటిదాకా అందాన్ని పెంచడానికి ఓ వైద్యుడిగా ఏమి చేయగలనో చెప్పాను. ఈసారి ఏమి చెయ్యలేమో చెప్తాను.
డాక్టర్‌ని అందరూ దేవుడితో పోలుస్తారు. పోల్చినంత మాత్రాన అది నిజం కాదు. ఎందుకంటే డాక్టర్ దేవుడు కాదు. దేవుడు ఏమైనా చేయగలడు. డాక్టర్ అన్ని చేయలేడు. ‘‘ఓ డాక్టరు ఎవరినైనా ఎలా అయినా మార్చేయగలడు’’ అని అనుకునేవాళ్ళు ఇది చదివి మానసికంగా మార్పు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను.
కొన్ని సంవత్సరాల క్రితం పూణెలో నేను చదువుకుంటున్న రోజుల్లో మా సార్ దగ్గరికి ఓ పేషెంట్ వచ్చాడు, తను రజనీకాంత్ వీరాభిమానినని. ‘‘మీరు మన దేశంలోనే చాలా పెద్ద సర్జన్ అంట కదా?’’- నా మొహాన్ని రజనీకాంత్ మొహంలా మార్చేయండి సార్. ఎంత డబ్బైనా ఫర్వాలేదు అని అన్నాడు ఆ వీరాభిమాని. నవ్వుతూ మా సార్, రజనీకాంత్ మొహంలా నీది మార్చడం కష్టం కాదు. కానీ ఆ మ్యానరిజమ్స్, ఇంకా తన స్టైల్ మాత్రం ఏం చేసినా నేను కాదు కదా, ప్రపంచం ఏ డాక్టర్ నీలో తీసుకురాలేడు. అవి స్వతహాగా రావాలి. స్టైల్ దైవం ఇచ్చే ఓ వరం. తన స్టైల్ లేనప్పుడు తనలా మారి ఏం చేస్తావు? అని మా సార్ తనకి సమాధానం ఇచ్చాడు. మొహంలో మార్పు తీసుకురావడం సాధ్యమేమో కానీ, మొత్తానికే మార్చేయడం అసాధ్యం, ఇంకా ప్రమాదకరం కూడా. ఇంగ్లీషు సినిమాలు చూసి కొంతమంది కుర్రకారు ఇది సాధ్యం అనుకుని, డాక్టర్ల చుట్టూ తిరుగుతారు. అలా చేయడం కాదన్నవారికి వైద్యం రాదని వారు నిర్థారించుకుంటారు. వైద్యం సాధ్యం అవుతుంది, నేను చేస్తా అన్న డాక్టరు వారికి తగిలితే వారు ఇంక మోసపోయినట్టే. తన చర్మం నచ్చక తెల్ల చర్మం కావాలన్న ఉద్దేశ్యంతో ఎన్నో సర్జరీలు చేయించుకుని, ఎంతో డబ్బు ఖర్చుపెట్టి, చివరికి ఒంటి నిండా గాట్లతో విపరీతమైన నొప్పితో బ్రతికిన ‘ది లెజెండ్ మైఖేల్ జాక్సన్’ గురించి మన అందరికీ తెలిసిందే.
ఓసారి ఓ అమ్మాయి నా దగ్గరికి వచ్చింది, తన మొహాన్ని చూపించుకోవడానికి. డాక్టర్ ‘‘నా నుదురు కొంచెం ఎత్తుగా లేదూ? కనుబొమ్మలు క్రిందకి పడిపోయినట్టు లేవూ? ముక్కు ప్రక్కకు తిరిగినట్టు లేదూ? బుగ్గమీద సొట్ట లేదూ? చెంపలు లోపలికి పోయినట్టు లేవూ?’’ అని చెప్తూనే ఉంది. వినడానికి నాకే విసుగు వచ్చి ‘‘ఆపమ్మా అని అరిచాను. నీ మొహంలో నీకు అన్నీ వంకలే కనిపిస్తున్నాయి. ఏదైనా మంచిగా ఉన్నట్టు కనిపిస్తుందా?’’ అని అడిగా. నా మొహంలో నాకు నచ్చేది నా ఒతె్తైన జుట్టే. అది కూడా ఇప్పుడు రాలిపోతున్నది అని చెప్పి బాధపడింది. నువ్వు సర్జన్ దగ్గరికి కాదు, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లాలి అని అన్నా. ఒకసారి దించిన మొహాన్ని పైకి లేపి నన్ను చూసింది. ఒకటి, రెండు సమస్యలు ఉంటే చికిత్స చేయవచ్చు కానీ, ఇన్ని సమస్యలు ఉంటే అప్పుడు చికిత్స మొహానికి కాదు మనసుకి చేయవలసి ఉంటుంది. అది సైకియాట్రిస్ట్ చేస్తాడు అన్న నా మాటకి ఖంగుతింది. కొంతమందికి అందం పిచ్చి, అద్దం పిచ్చి మహా ఉంటుంది. పొద్దున లేవగానే అద్దం ముందు నుంచుని, వాళ్ళని వాళ్ళు తెగ పరీక్షించుకుంటూ ఉంటారు. లేవగానే మొహంమీద ఒక మొటిమ కనిపిస్తే చాలు, ఇక చదవడం ఆపేస్తారు. తినడం మానేస్తారు. బాధపడుతూనే ఉంటారు. ఇంత అందం పిచ్చి ఉన్నవారు ఎప్పుడూ ఆనందంగా ఉండలేరు.
ఓసారి ఓ పేషెంట్ తన సమస్య చెప్పాడు. అలా చేయడం కుదరదు అని నేను చెప్తే, ‘‘చూడండి సార్! మీరు తలచుకుంటే అయిపోతుంది’’ అని అన్నాడు. తలుచుకోగానే అయిపోవడానికి నేను మహర్షిని కాదు.
ఒక సాధారణ మనిషిని. వైద్యం అనేది ఓ శాస్త్రం. దానికి ఓ పరిమితి ఉంటుంది. ఆ పరిమితిని దాటి ప్రయోగాలు చేస్తే ఫలితాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఇది జనం అర్థంచేసుకోవాలి. బాధితులు గ్రహించాలి. మరోసారి ఓ యువకుడు తన ముక్కు సరిగ్గా లేదని చూపించుకోవడానికి వచ్చాడు. నేను పరీక్షించి ఏమి చేయగలనో చెప్పా. తను ఇంకేదో అయిపోతుందని ఊహించుకున్నాడు. అలా చేయలేం అన్నా, తనకి అలానే కావాలన్నాడు. నేను చేయలేను సారీ అని చెప్పి వదిలించుకున్నా. అలాంటివారు ఎంత చేసినా తృప్తి చెందరు. కొంతమంది అయితే ఆపరేషన్ తర్వాత బాగా అవ్వలేదని మానసిక ఆవేదనకు గురి అవుతారు. కొంతమంది ఉక్రోషంతో చేసిన సర్జన్‌పైనే తిరగబడతారు. ప్రపంచంలో కొంతమంది వారికి సరిగ్గా ముక్కు ఆపరేషన్ జరగలేదన్న కోపంతో చేసిన సర్జన్‌ని చంపేసిన పేషెంట్లు ఉన్నారు. ‘జ్హీ జో జ జె’’ అన్నది చాలా ముఖ్యమైనది. పైన చెప్పిన కుర్రాడి లాంటి వారికి ఆపరేషన్ చేస్తే ఇంక కష్టాలు కొనితెచ్చుకున్నట్టే.
అందంగా ఉండవద్దు అనట్లేదు. కాని అందమే ప్రపంచం అన్న భావనలో ఉండడం మంచిది కాదు. వారు ఏనాటికి ఆనందాన్ని రుచి చూడలేరు. తొడుక్కునేందుకు మంచి జోళ్ళు లేవని బాధపడేవారు, కాళ్ళు లేని వాళ్లను చూస్తే తెలుస్తుంది, వాళ్లకి ఏమి ఉన్నాయో అని. మొహం నిండా ఆనందం ఉంటే మనం ఎలా కనిపించినా ప్రపంచానికి అందంగానే ఉంటాం. నేటి యువత దీని గురించి ఓసారి ఆలోచిస్తే మంచిది. *

పాఠకులకు సూచన
‘‘మీ సమస్యలకు, సందేహాలకు సమాధానాలు’’ పొందాలనుకుంటే ప్రశ్నలు ఈ చిరునామాకు క్లుప్తంగా పంపండి. వాటిని భూమికలో ప్రచురించడం జరుగుతుంది.
మీ ప్రశ్నలను ‘‘మీ సందేహాలు- నా సమాధానాలు’’
అనే శీర్షికకు పంపాలి.
చిరునామా : డా శ్రీరంగం రమేష్, ఫేస్ క్లీనిక్,
1-3-15, కలాసిగూడ,
సికింద్రాబాద్-500003

-డాక్టర్ రమేష్ శ్రీరంగం సెల్ నెం: 92995 59615 faceclinics@gmail.com