Others

వాస్తవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాపత్రయాలు
తహతహలెన్నున్నా
అలుపెరుగని
ఆర్భాటాలతో
భయాలను నిర్భీతిగా
చలామణి చేసుకోబూనితే
నవ్వేవారే తప్ప నమ్మేదెవరు?
ఎంతగా దిగజారినా
కాకి అరుపు
కోకిలా గానమయ్యేనా
ఎందరు ఎగదోస్తున్నా
అబద్ధాల పరంపర
ఒకే ఒక్క నిజమయ్యేనా

పలాయనవాదం
ఏళ్లు గడిచినా
ముసుగులు తొడుగుతుందే తప్ప
వాస్తవాన్ని చూపదు సరికదా
వాస్తవాన్ని చూడనివ్వదు
అలాగని వాస్తవం
తానేమిటో లోకానికి
దూరంగా వుండిపోదు

- డా. కొల్లు రంగారావు