Others

అరచేతిలో అందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆషాఢమాసం రాగానే జ్ఞాపకం వచ్చేది గోరింటాకు. సంస్కృతంలో గోరింటాకును నఖరంజని అంటారు. గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే శక్తి, దాంతోపాటు రోగ నిరోధక శక్తి కూడా వుంది కాబట్టి ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం శ్రేష్టమని మన పెద్దలు చెప్పారు. అదే సంప్రదాయంగా వస్తోంది. సంప్రదాయం సంగతి అలా ఉంచితే గోరింటాకు వలన ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.
ఆరోగ్యానికి గోరింట
మహిళలు ఎక్కువగా ఇంటిపనుల్లో మునిగి ఉంటారు. ఎక్కువసేపు నీళ్లలో నానడం కారణంగా కాళ్లు, చేతులు ఒరిసిపోయి ఇన్‌ఫెక్షన్ రావడం, కాలి, చేతిగోళ్లు పుచ్చిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. గోరింటాకు పెట్టుకోవడం వలన ఇలాంటి ఇబ్బందులనుంచి బయటపడవచ్చు. శరీరంలో వేడిని హరిస్తుంది. చేతులకు కాళ్లకు పెట్టుకోవడంవలన గోళ్లు పుచ్చిపోకుండా కాపాడుతుంది. గోరుచుట్టు లాం టివి రా కుండా నివారిస్తుంది. గోరింట పువ్వు, ఆకులు, వేర్లు, విత్తనాలు, బెరడు ఇలా గోరింత చెట్టులో ప్రతిభాగం ఔషదీయ గుణాలను కలిగి ఉన్నాయని పరిశోధకులు చెప్తున్నారు. చర్మవ్యాధులను నయం చేసే గుణం ఇందులో వుందని పరిశోధనల్లో తేలింది. ఇక చాలామందికి అరికాళ్లు, అరిచేతులు మంటలతో బాధపడుతుంటారు. అలాంటపుడు గోరింటాకు ముద్దలో కొద్దిగా నిమ్మరసం కలిపి అరిచేతులకు, అరిపాదాలకు పట్టించి మృదువుగా రుద్దితే ఆ మంటలు తగ్గుతాయని చెప్తారు. బెణుకులకు, గాయాలకు, నిద్రలేమి వంటి సమస్యలకు కూడా గోరింట అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద శాస్తజ్ఞ్రులు చెప్తున్నారు. కాలిన గాయాలవల్ల ఏర్పడిన మచ్చలు, అమ్మవారు వచ్చి తగ్గిన తరువాత ఏర్పడిన మచ్చలలాంటివి పోవాలంటే తరచుగా గోరింటాకును రుబ్బి ఆ మచ్చలమీద రాస్తుంటే మచ్చలు క్రమంగా మాయమవుతాయట. గోరింటాకును ఔషధంలా శరీరంలోపలికి తీసుకుంటే అల్సర్‌లాంటి రోగాలను నయం చేయడంలోను, పేగులను శుభ్రం చేయడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి. అయితే వీటిని ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. గోరింట నూనె గాయాలను అతి త్వరగా నయం చేస్తుందని కూడా ఆయుర్వేద శాస్తజ్ఞ్రులు చెప్తున్నారు.
శిరోజాల
సౌందర్యానికి
గోరింటాకు జుట్టుకు కూడా మంచి ఔషధంగా పనిచేస్తుంది.
స్వచ్ఛమైన గోరింటాకును జుట్టు కుదుళ్లకు పట్టించి ఓ గంట తరువాత స్నానం చేస్తే జుట్టుకు మంచి మెరుపు ఇవ్వడమే కాకుండా శిరోజాలు రాలిపోవడం, చుండ్రు, దురదలు, పేలు లాంటి ఇబ్బందులను కూడా దూరం చేస్తుంది. సహజమైన డైగా పనిచేస్తుంది. శిరోజాలకు మంచి కండీషన్‌గా పనిచేసి త్వరగా తెల్లబడకుండా కాపాడుతుంది. జుట్టు కుదుళ్లు గట్టిపడి, శిరోజాలు ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడుతుంది. శిరోజాలు నల్లగా నిగనిగలాడుతూ, చక్కటి మెరుపుతో అందంగా తయారవుతుంది.
ఒక్క ఆషాఢంలోనే కాదు వివాహ సందర్భాల్లో గోరింటాకుకు ప్రముఖ స్థానముంది. ఉత్తరాదిలో అయితే వివాహానికి ముందు గోరింటాకు పెట్టుకోవడానికి ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించి పెద్ద పండుగలా చేసుకుంటారు. అట్లతద్దిలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా ఆడపిల్లలు చేతికి గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకు సౌభాగ్యానికి ప్రతీక అని జ్యోతిష్కులు చెప్తున్నారు.

- చంద్రిక