Others

ప్రభుత్వాల మధ్య ఘర్షణ ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం కేంద్రంలో ఓ జాతీయ పార్టీ, కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉంటూ చీటికీ మాటికీ గొడవ పడుతున్నాయి. మన ఫెడరల్ రాజ్యాంగంలో కేంద్రానిది కుటుంబ పెద్ద పాత్ర, రాష్ట్రాలు కుటుంబ సభ్యులు. రాష్ట్రాల సమస్యలన్నింటినీ కేంద్రం తీర్చలేకపోవచ్చు. తమ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించుకోవచ్చు. చట్టసభల్లో రచ్చ చేయకుండా చర్చల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, ప్రజలకు ప్రాంతీయ పార్టీల నేతలు తమ వాదనలను వినిపించవచ్చు. సుప్రీం కోర్టు ఉంది. చివరకు ప్రజాకోర్టులో తేల్చుకోవచ్చు. రాష్ట్రాలతో సయోధ్యకు బదులు నేడు ప్రధాని మోదీ కూడా ప్రజాగ్రహానికి భయపడేకదా తాయిలాలిస్తున్నారు.
కేంద్రం బలహీనపడితే తాము చక్రం తిప్పవచ్చని కొంతమంది ప్రాంతీయ నేతల ఆశ. అందుకే గోటితో పోయే సమస్యలను గొడ్డలి వరకు సాగదీస్తూ ప్రాంతీయ భావాలు రెచ్చగొడ్తున్నారు. ప్రధాన మంత్రి హోదాలో ఉన్న నేతకు ఏ రాష్ట్రంపైనా ప్రత్యేకాభిమానం, కక్షలు వుండవు, వుండకూడదు. రాజకీయావసరాల కోసం కొన్ని వివాదాస్పద నిర్ణయాలు అన్ని ప్రభుత్వాల వలేనే తీసుకుని వుండవచ్చు. ప్రధాని మోదీ కంటే తాము సీనియర్లమని, మేధావులమని కొందరు నేతల భావన. నిజమే. కాని వారందరికంటే సీనియర్లు, నిజాయితీపరులు, ప్రజాసేవకు సొంత ఆస్తులు త్యాగం చేసిన, చేస్తున్న వారెందరో దేశంలో వున్నారు. అయితే అందలమెక్కి ప్రజాసేవ చేసే అవకాశం కొందరికే దక్కుతుంది. మోదీ లౌక్యం లేక కొంత ఏకపక్షంగా వ్యవహరిస్తున్న మాట నిజమే కాని, నిత్యం ప్రధానిని దూషించే నేతలు తమ కింది స్థాయి వారితో, సాటివారితో ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్నారా? వోట్లు పొందే ఆలోచనతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు. నేడు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి అధికారంలోకి రావటం పెట్టుబడి లేని వ్యవహారంగా మారింది. ప్రభుత్వ వ్యవస్థలను రాజకీయ కోణంలో వాడుకోవడం కేవలం మోదీతోనే మొదలు కాలేదు, ఇదే అంతం కాదు. మేధావులే ాజకీయాల కతీతంగా ప్రజలను చైతన్యవంతులను చేయాలి. ప్రాంతీయ పార్టీల హవా పెరగడంతో నేడు జాతీయభావాలు తగ్గుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పర్యటనలకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలే ఆటంకపరచాలనుకోవటం బాధ్యతా రాహిత్యం, రాష్ట్ర ప్రయోజనాలకు భంగకరం. దీనివల్ల బీజేపీకి కొత్తగా వచ్చే నష్టం లేదని ప్రాంతీయ పార్టీల అధినేతలు గ్రహించాలి. పెద్ద పెద్ద నేరాలు, ఘోరాలకు పాల్పడే వారికి సైతం వారి వాదన వినిపించే హక్కుంది. మరి ఆ అవకాశం ప్రధానికి లేదా? ప్రజలే న్యాయ నిర్ణేతలు, భయపడాల్సిన పని లేదు. మోదీపై ద్వేషాన్ని కేంద్రంపై ద్వేషంగా మార్చి ప్రజాస్వామ్యం పేరుతో తమిళనాడులో వలె ‘తెలుగు జాతి, బెంగాల్ జాతి, కన్నడ జాతి’ అని ప్రజలకు నూరిపోస్తే జాతీయ భావాలు నశించి, గతంలోవలె కొత్త సంస్థానాధీశుల ప్రాభవం పెరిగి ‘బాంచన్ దొరా’ అనే బానిస స్థితి దాపురించవచ్చు. ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా చైతన్యవంతులై బాధ్యతాయుత పౌరులుగా వుంటేనే ఈ దేశానికి రక్ష.

-తిరుమలశెట్టి సాంబశివరావు