Others

సూట్‌కేసులో కుక్క!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగారం, గంజాయి లాంటివి దొంగతనంగా తెచ్చే ప్యాసింజర్లని చూశాం గానీ, కుక్కల్ని సూట్‌కేసుల్లో క్రుక్కి, రహస్యంగా తమ కూడా విమానాల్లో తెచ్చుకుంటున్న యజమానులు- రుూమధ్య మూడుసార్లు దొరికారు.
విదేశాలలోని ఇండియన్స్ తమ పెంపుడు కుక్కల్ని తీసుకురావాలీ అంటే, దానికి చాలా తంతు వుంది. మెడికల్ సర్ట్ఫికెట్, నో అబ్జెక్షన్ సర్ట్ఫికెట్టు- వగైరా. అంచేత కుక్కకి మత్తుమందు యిచ్చి- చేత పట్టుకుని, విమానం ఎక్కడానికి అనుమతి వున్నా- సూట్‌కేసులో పెట్టుకుని తెచ్చేసుకుంటున్నారు. కానీ, ఎక్స్‌రే స్క్రీన్‌మీద ఢిల్లీ విమానాశ్రయంలో రుూ కుక్క(లు)న్నట్లు బయటపడిపోతోంది. అలాంటి నాలుగు కేసులు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బయటపడ్డాయి.
ఒకావిడ కుక్కను తీసుకుని వస్తూ అడ్డంగా దొరికిపోయింది. పశువుల డాక్టర్ సర్ట్ఫికెట్ వుందిగానీ- ఢిల్లీ అథార్టీ నో అబ్జెక్షన్ సర్ట్ఫికెట్ మాత్రం లేదు. అయితే ఆ మహిళ కుక్కని యిస్తే తప్ప విమానాశ్రయం ‘లోంజ్’ వదలనని భీష్మించుక్కూర్చుంది.
మూడు రోజుల బలవంతపు ఆతిథ్యం యిచ్చారు ఎయిర్‌పోర్టువారు. ఆనక ‘నో అబ్జక్షన్’ తెచ్చి ఆమెనూ, కుక్కనూ వదిలిపెట్టి ఓ నమస్కారం పెట్టారు. కుక్క బ్రతుకే హారుూ!