Others

‘‘అమ్మోరి’’కోసం పసికందునమ్మిన ‘అమ్మ’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జార్ఖండ్ రాష్ట్రం కొండ జాతులలో యిప్పటికి అమాయక ఆదివాసుల తండాలున్నాయి. ‘బిహోర్’ కొండ జాతికి చెందిన అమోదేవి అనే ముగ్గురు పిల్లల తల్లికి నాలుగో కాన్పులో పండంటి బిడ్డను కన్నదిగానీ, మూడో రోజునే ఆ పసికందుని రెండు వేల రూపాయలకు అమ్మేసుకుంది. ఛాత్రా జిల్లాకి చెందిన ఒక వ్యపారి బిడ్డని కొనుక్కొని పోయాడు.
‘ఏం చెయ్యను దొరా! నేను కట్టెలు కొట్టుకొని, అమ్ముకుని నా ముగ్గురు పిల్లల్ని పోషించాలి. ఈ పసిబిడ్డ తండ్రి- రుూ బిడ్డ కడుపులో వున్నప్పుడే మమ్మల్ని దిక్కులేనివాళ్లని చేసి చనిపోయాడు. గ్రామంలోని పెద్దలు అంతా కలిసి నువ్వు బిడ్డని కనంగానే సరికాదు. అమ్మోరికి జాతర చేసి రెండు గొఱ్ఱెపొట్టేళ్లని ‘బలి’వ్వాలి. లేదంటే అమ్మ తల్లికి కోపం వచ్చి నినే్న కాదు- గ్రామంలో అందర్నీ కష్టాలపాలు చేస్తుంది. నువ్వు నాస్తికురాలివి అని చెప్పి గ్రామం నిన్ను వెలేస్తుంది, అన్నారు దొరా!’’ అని ఆమె పోలీసుల ముందు తన గోడు చెప్పుకుంది.
పోలీసులు ఆ వ్యాపారి దగ్గరనుంచి ఆ పసిపాపను తెచ్చి, ఆమెకు అప్పగించి చేతులు దులుపుకున్నారు. పొట్టేళ్లను ఆరగించి, జనాలు తాగి తందనాలు ఆడారు. ఈలోగా ఛాత్రపూర్ వ్యాపారి వచ్చి ‘‘నా రెండు వేల రూపాయలూ నాకివ్వు’’ అని పీకలమీద కూర్చున్నాడు.
పందోము పుల్లల్ని అమ్ముకుని, తన నలుగురు బిడ్డల్నీ, తన పొట్టనూ పోషించుకునే రుూ నిరక్షర కుక్షి ఆదిమవాసి కుప్పకూలిపోయింది. కాని, ఆ పసివాడు పుట్టిన వేళావిశేషం అన్నట్లుగా రామఘడ్‌కు చెందిన ఒక బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్- జైల్‌కుమార్- ‘‘ఏడవకమ్మా! రుూ బిడ్డని పెంపకానికిద్దాం. ఏర్పాట్లు చేస్తాను’’ అంటూ ఓదార్చాడు. అంతేకాదు, ఆమెకు ఆదిమవాసి అనాధగా రావాల్సిన గవర్నమెంటు సదుపాయాలు యిప్పిస్తానంటూ సర్కారువారికి అర్జీ కూడా పెట్టించాడు.
‘పందుం పుల్లలమ్మా!’ అంటూ అమ్ముకుంటూ ప్రస్తుతానికి అమోదేవి పసిబిడ్డని ఒడిలో కట్టుకుని కానుగ పుల్లల మోపును నెత్తిన పెట్టుకుని నగరంవైపు దారితీసింది!