Others

కుక్కతో ‘సెల్ఫీ’- బుగ్గ కండ లాగేసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెల్ఫీల పిచ్చి నిత్యమూ- ఎక్కడో అక్కడ యువతీ యువకులకి ప్రాణహాని కలిగిస్తూనే వుంది. అలాగే రుూ కాలం సంకర జాతి కుక్కల కాలం అవడంతో కొన్ని కుక్కలు ‘విశ్వాసం’ అన్న గుణానే్న మరచిపోయాయి. యజమానులనే మట్టువెట్టేస్తున్నాయి. ఇంచుమించు ప్రతిరోజూ రుూమధ్య కుక్కలు పిల్లల్ని కొరుక్కుతినడం వార్తలు వెలువడుతూనే వున్నాయి. కుక్కల్ని పిల్లలకన్నా అమితంగా ప్రేమించే ఇంగ్లండులో - ఆగ్నేయ ప్రాంతం రాష్ట్రం ‘ఎస్సెక్స్’కు చెందిన ‘చెల్మెస్‌ఫర్డ్’ టౌన్‌లో, ఓ ఇంటి ‘డిగ్బీ’- కుక్క పేరు అది- తనతో సెల్ఫీ తీసుకుందామనుకున్న పదకొండు సంవత్సరాల కుర్రాణ్ని బుగ్గ కండలెక్క లాగేసింది!
పిల్లవాడు చచ్చిబ్రతికాడు. బుగ్గమీద ఇరవై ఒక్క కుట్లు పడ్డాయి. ఈ పిల్లవాడు స్కూలుకు పోలేక- స్నేహితుల్ని కలుసుకోలేక- దారుణంగా చితికిపోయి, అతుకుల బొంతలా వున్న బుగ్గని దాచలేక- యమయాతన పడుతున్నాడు. వాడి దుఃఖానికి అంతులేదు.
ఈ కుక్క- హారిస్ అనే స్నేహితుడి యింటి కుక్క. ఈ పిల్లాడితో సరసాలాడుతూనే వుంటుంది. పిల్లవాడి తల్లిదండ్రులు- ‘‘ఇది యివాళ మా పిల్లవాడికయింది- రేపు మరికొంతమందికి హాని కలిగించవచ్చును. కనుక కేసు పెడుతున్నాము’’ అన్నారు.
మాజిస్ట్రేటు కేసు అంతా విచారించాక- ఈ కుక్క పుట్టుకని ఆరా తీశాడు. ఈ డిగ్బీ ఒక జర్మన్ షెప్పర్డ్ జాతి కుక్కకీ- బుల్ మాస్ట్ఫి జాతి కుక్కకీ సంకరంగా జన్మించింది. కేసు సాగుతుండగానే, రుూ డిగ్బీ మరో మనిషిని కరిచింది. కుక్క యజమాని- తనది తప్పేననీ, కుక్కని కంట్రోలు చెయ్యలేకపోతున్నాననీ ఒప్పుకున్నాడు. మాజిస్ట్రేటు జరిమానా, సామాజిక సేవా శిక్ష వైగైరాలు వేశాడు. కుక్క యజమాని రెండొందల గంటలపాటు సామాజిక సేవ చెయ్యాలి. కుక్క కాటు తిన్న బాలుడికి ఐదువేల పౌండ్లు పరిహారం చెల్లించాలి. అంతేనా? కోర్టువారికి 170 పౌండ్లు ఖర్చుల నిమిత్తం చెల్లించాలి. అంతేకాక కుక్కను అంతం చెయ్యాలి’’ అన్నది కోర్టు. అప్పీలుకు 20 రోజులు టైము యిచ్చాడు.
‘కుక్కలున్నాయి.. సదా జాగ్రత్త!!’