Others

మమ్మల్ని తోడేళ్ల పాల్జేశారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాతంత్య్ర సముపార్జనమనే మహోన్నత లక్ష్యానికి తన జీవితాన్ని అంకితం చేసి చరిత్రలో నిలిచిపోయిన రాజకీయ, ధార్మిక నాయ కుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ‘సరిహద్దు గాంధీ’గా ప్రఖ్యాతి పొందిన ఖాన్ 1890, ఫిబ్రవరి 6న బ్రిటిష్ ఇండి యాలోని పెషావర్ లోయలో సంపన్న కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి బహ్రం ఖాన్ ఒక భూస్వామి. బ్రిటిష్ వారి ఎడ్వడ్స్ మిషన్ పాఠశాలలో చదువుతూ తెలివైన విద్యార్థిగా పేరు పొందారు.
మనుషుల్లో దేవుడిగా జాతిపిత గాంధీజీచే ప్రశంసలు పొందిన ఆయన జీవితం నేటికీ అందరికీ ఆదర్శప్రాయం. బ్రిటీష్ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన ఆయన పాకిస్తాన్‌లోని పంఖ్తూన్ రాష్ట్రంలో పఠాన్‌గా పుట్టి అహింసా మార్గమే ఆయుధంగా మార్చుకొని ‘పఠాన్ యమ డేంజర్’ అని అప్పటి పాలకులతో అనిపించుకున్న ధీరోదాత్తుడు. ‘నేను ఆయుధంతో యుద్ధం చేసే పఠాన్‌ను కాను. ఏ పరిస్థితుల్లోనైనా నాది అహింసామార్గమే. పగ, ప్రతీకారాలు నాకు నచ్చవు. నన్ను అణచివేసి, హింసించిన వారిని కూడా క్షమిస్తాను’ అన్న ప్రతిజ్ఞతతో ‘కుదాయ్ కిద్మత్ గర్’ పేరిట ఎర్ర చొక్కాల ఉద్యమం లేవనెత్తి భారత స్వాతంత్య్ర పోరాటానికి స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన శాంతికాముకుడు సరిహద్దు గాంధీ.
దేశ విభజన సమయంలో ఫఖ్తూన్ రాష్ట్రంలో చెలరేగిన అల్లర్లలో ముస్లింల దాడుల నుంచి ఎంతోమంది హిందువులను, సిక్కులను ఆయన కాపాడారు. ఆ సమయంలో ఆయనకు కుదాయ్ కిద్మత్ గర్ సేన ఎంతో సహాయపడింది. అల్లర్లను ఆపేందుకు ఆయన మహాత్మాగాంధీతో కలసి బిహార్ వెళ్లి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. భారత్‌ను తగులబెడితే హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు అందరం దగ్ధం అవుతామని హెచ్చరించారు. శాంతి, సౌభ్రాతృత్వాలతో సమరాన్ని సాగించమని చెప్పారు. ఇటు బ్రిటీష్ ఇండియాలో, అటూ పాక్‌లో 27 ఏళ్లపాటు జైలు జీవితాన్ని అనుభవించిన సరిహద్దు గాంధీ అఫ్గాన్ లోని కాబూల్ నగరానికి వెళ్లి ప్రవాస జీవితం గడిపారు. తుది శ్వాస విడిచేంత వరకు నమ్ముకున్న సిద్ధాంతానికే కట్టుబడి జీవించారు.
గాంధీజీ పిలుపు మేరకు 1930లో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనేందుకు ఆయన ఉట్మంజాయ్ నుంచి పెషావర్ వెళుతుండగా అరెస్ట్ చేశారు. ఇది తెలిసిన కుదాయ్ కిద్మత్ గర్ సేనకు చెందిన కార్యకర్తలు భారీ సంఖ్యలో పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. వారిపై కాల్పులు జరపాల్సిందిగా బ్రిటీష్ అధికారులు ఉత్తర్వులివ్వగా- ‘కాల్పులు జరిపినా ఫర్వాలేదు. ప్రాణాలిస్తాం’ అంటూ శాంతియుత నినాదాలతో సమన్వయం పాటించిన ప్రజలపై కాల్పులు జరిపేందుకు సైనికులు నిరాకరించారట. అదే సమయంలో అరెస్టయిన మహాత్మాగాంధీని, ఆయన అనుచరులను 1931 జనవరి నెలలో విడుదల చేశారు. ఖాన్‌ను మాత్రం విడుదల చేయలేదు. చివరకు గాంధీయే ఖాన్‌ను విడిపించారు. ఆ తర్వాతఖాన్ ను మళ్శీ అరెస్ట్ చేసి నాలుగేళ్ల పాటు జైల్లో పెట్టారు. పోలీసులు అరెస్టులు చేయడం, ఏదో ఒక కారణాన్ని పేర్కొంటూ విడుదల చేయటం గఫార్ ఖాన్ జీవితంలో భాగమైపోయింది.
1929లో ప్రారంభమై 1948లో అదృశ్యమైన ఖుదా-యే-ఖిద్మత్ గర్ సేన స్వాతంత్రోద్యమంలో ప్రపంచ ప్రజలందరి జేజేలు అందుకుంది. గఫార్ ఖాన్ అభ్యర్థన మేరకు వాయవ్య సరిహద్దు రాష్ట్రంలో పర్యటించిన మహాత్మాగాంధీ మాట్లాడుతూ, ‘ఖుదా-యే-ఖిద్మత్ గర్ కార్యకర్తల్లా ఓ వెయ్యిమంది తయా రైతే చాలు, బానిసత్వమనే సామాజిక రుగ్మతను దేశం సరిహద్దులను దాటించవచ్చు’ అని ప్రశంసించారు.
ఆ రోజుల్లో కుదాయ్ కిద్మత్ గర్‌కు ప్రజల్లో ఎంతో ఆదరణ ఉండేది. 1946లో జరిగిన ప్రావిన్షియల్ ఎన్నికలలో గఫార్ ఖాన్ నేతృత్వంలో కాంగ్రెస్ తిరిగి అధికారాన్ని చేపట్టింది. ముస్లింలీగ్‌కు మరోసారి పరాజయం తప్పలేదు. ఆ పరాభవం నుండి కోలుకునేందుకు ముస్లిం లీగ్ భారత్ విభజన యత్నాలకు ఊపిరి పోస్తూ, అధికార దాహార్తులైన రాజకీయ నేతలను, వ్యాపారవేత్తలను, పెట్టుబడిదారులను, భూస్వాములను అధికారం, ఆదాయం ఎరవేసి ఆకట్టుకోసాగింది. ఆంగ్లేయ అధికారులు, పాలకులు ముస్లింలీగ్‌కు మిత్రులుగా వ్యవహరించసాగారు. మొదటి నుంచి దేశ విభజనను వ్యతిరేకిస్తూ వచ్చిన ఖాన్ చివరకు నిర్ణయాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకే వదిలేశారు. ఆ సమావేశం అత్యధిక మెజారిటీతో దేశ విభజన తీర్మానాన్ని ఆమోదించింది. విభజన అనివార్యం అనిపించే పరిస్థితులను గమనించిన ఖాన్ ఆవేదన చెందారు. 1947 మే 1న భారత జాతీయ కాంగ్రెస్ దేశ విభజనకు సూత్రప్రాయంగా అంగీకరించింది. జూన్ 3న విభజనకు సమ్మతి తెలియచేసింది. విభజన తీర్మానం ప్రవేశపెట్టగా దానిని వ్యతిరేకించిన ఏకైక వ్యక్తి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఆ రోజున గఫార్ ఖాన్ గాంధీజీతో మాట్లాడుతూ, ‘మహాత్మా ఇక నుండి మమ్మల్ని పాకిస్తాన్ వారంటారు. విదేశీయులం అంటారు.. అవునా..? అంటూ గుండెల్లోతుల్లో నుంచి పెల్లుబికిన మనోవ్యధను వ్యక్తం చేశారు.
భారత విభజన జరిగితే వాయవ్య సరిహద్దు రాష్ట్రం పాకిస్తాన్ లోకి వెళ్ళే అవకాశం ఉంది. ముస్లింలీగ్ పాకిస్థాన్ లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆ పరిణామాలు సంభవిస్తే అంతవరకు ముస్లింలీగ్ ను, విభజనను వ్యతిరేకించిన పాపానికి ఖాన్ సోదరులు, వారి అనుచరగణం, ఖుదా-యే-ఖిద్మత్ గర్ కార్యకర్తలు నూతన ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు గురికావాల్సి వస్తుంది. ఈ పరిస్థితులను అంచనా వేసిన ఖాన్ గాంధీజీతో మాట్లాడుతూ ‘మీకు అండగా నిలబడ్డాం.. మీతో పాటు పఠాన్లు దేశ స్వాతంత్య్రం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. మమ్మల్ని తోడేళ్ల పాల్జేశారు’ అన్నారు. ‘మాకు మరో అవకాశం ఇవ్వలేదు..’ అని ఖాన్ తన బాధను వ్యక్తం చేస్తూ దేశ విభజన అనంతరం పెషావర్‌కే పరిమితం అయ్యారు.
ఖాన్ అన్నట్లుగానే ఖుదా-యే-ఖిద్మత్ గర్ కార్యకర్తలు అణచివేతకు గురి కావాల్సి వచ్చింది. బ్రిటీష్ ప్రభుత్వ కాలంలో 15 ఏళ్లు జైలు జీవితం చవి చూసిన గఫార్ ఖాన్ ను నూతన ప్రభుత్వం ఏమీ చేయలేకపోయంది. తన అనుచరుల పరిస్థితి ఆయనకు ఆందోళనకు గురి చేసింది. స్వాతంత్య్ర సమరయోధులైన ఖుదా-యే-ఖిద్మత్ గర్ కార్యకర్తలపై పాక్ ప్రభుత్వం ఎటువంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడినా తాను సహించనని గఫార్ ఖాన్‌కు గాంధీజీ ఊరట కలిగించారు. కానీ అది ఊరటగానే మిగిలిపోయింది. ఖాన్, ఆయన అనుచరులు పాకిస్థాన్ పాలకవర్గాల చేతుల్లో పలు ఇక్కట్లపాలయ్యారు. ఈ విషయాలను గఫార్ ప్రస్తావిస్తూ- ‘ముస్లిం లీగ్ వారు ఖుదా-యే-ఖిద్మత్ నాయకులను అంతం చేయాలని తమ కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నారు. ఇస్లాంకు వ్యతిరేకులైన అందరినీ ఉరితీస్తారని బహిరంగ సభలలో ప్రకటిస్తున్నారు..’ అని బాధను వ్యక్తం చేశారు. అక్కడి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి జైలు పాలయ్యారు. 1960వ దశకంలో జైలు నుంచి విడుదలయ్యాక అఫ్గాన్‌కు ప్రవాసం వెళ్లారు.
1969లో మహాత్మాగాంధీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా గఫార్ ఖాన్ భారత్ వచ్చారు. అదే సమయంలో అహ్మదాబాద్ సహా దేశంలోని పలు చోట్ల హిందూ, ముస్లింల మధ్య అల్లర్లు చెలరేగాయి. ఆయన అహ్మదాబాద్ వెళ్లి అల్లర్లను ఆపేందుకు మూడు రోజులపాటు నిరాహార దీక్ష చేశారు. అల్లర్ల అనంతరం హిందూ ప్రాంతాల్లో హిందువులు, ముస్లిం ప్రాంతాల్లో ముస్లింలు సహాయక చర్యల్లో పాల్గొనడం చూసి ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
1985లో భారత జాతీయ కాంగ్రెస్ స్వర్ణోత్సవాలకు గఫార్ ఖాన్ తన కుమారుడు వలి ఖాన్‌తో కలిసి భారత్‌కు వచ్చారు. 1987లో వైద్య చికిత్స నిమిత్తం భారతదేశం వచ్చిన ఆయనను ‘్భరతరత్న’ అవార్డుతో మన ప్రభుత్వం వారు గౌరవించారు. భారత ఉపఖండంలో గాంధీజీకి ప్రతిరూపంగా నిలిచిన ఆయన 98 వయసులో- 1988 జనవరి 20న పెషావర్‌లో కన్నుమూశారు. ఆయన స్మారకార్థం 2012లో చర్సడాలో ఓ యూనివర్సిటీని పాక్ ప్రభుత్వం స్థాపించింది.

-దామరాజు నాగలక్ష్మి nagalakshmidamaraju@gmail.com