Others

పుట్టమన్నును

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను
శబ్దసాగరం మీద
విచ్చుకున్న చంద్రోదయాన్ని
మీరు దాచుకోలేకపోతున్న ప్రహేళికల్లోంచి
పునర్జన్మిస్తున్న అవశేష క్షణాన్ని
ఏకాంకికలో బహుముఖీనమైన
పాత్రధారిని నేనే
నిగూఢమైన మీ లోలోతుల్లో
సుడులు తిరుగుతున్న గొంతుకని నేనే

‘సమస్తస్వసుఖినోభవంతు’ శాలువాల్లో దూరి
వెర్రి ముఖాన్ని దాచుకున్న మీరు
నీడల మర్రి తుపాన్లలో కొట్టుకుపోతుంటారు
నిషాద సంగీతాన్ని అదేపనిగా
చేది పోసుకుంటున్న పాయల్లో
మీ అస్థికల మీద నేను మాత్రం
బీజాక్షరాల ఊటనై ఊరుతుంటాను

ప్రవాహంలో మీకు ఈత నేర్పటం
నాకు తప్పదు కదా
మయసభలో మర్మక్రీడల మీద కప్పుకున్న
ఆచ్ఛాదనల్ని తీసివేయక తప్పదు కదా
ఖండిత హస్తాలతో మీరు రాసుకోబోతున్న
కావ్యానికి ప్రోలోగ్‌ని నేనే
రేపటి స్వప్నశాలలో
మీరు ఆవిష్కరించుకోక తప్పని
హెచ్చరికనీ నేనే

దారుల మీద కమ్మిన పొగమంచు కాదు నేను
నా మీదుగా అడుగులేస్తూ పోతున్న
మీ మూడో పాదాన్ని ఎక్కడ మోపాలో
తెలియని క్షణాన నా దోసిలిని మీ కోసం విప్పుతాను
నేను హఠాత్ సంఘటనల చౌరస్తాలో
మీ కోసం దారి చూపే సజీవ విగ్రహాన్ని

కాలడం తెలిసినవాణ్ణి కనకే
కర్రులా గుక్క తిప్పుకుంటున్న
ఉదయాన్ని నేను
దీర్ఘచతుర్రసాల మధ్య ధాతువుగా పోత పోసుకున్న
స్వాగత ద్వారాన్ని నేను
తపస్సుల్ని తెగనరికిన సమాధుల్లో
ఏ దోషం అంటని ఆహ్వానాన్ని నేను
మీరు దోసిళ్లకెత్తుకోవడం కోసం
ఏ కాలానా
ఎదురుచూస్తున్న పుట్టమన్నును నేను

- యార్లగడ్డ రాఘవేంద్రరావు, 9985411099