Others

సంక్రాంతి మానిఫెస్టో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆగామిగా వస్తానంటే స్వాగతించలేను సంక్రాంతి
ఆకాంక్షలు నెరవేరుస్తానంటేనే స్వాగతిస్తా విక్రాంతి
ఎన్నో ఆశలు ఇంకెన్నో ఆకాంక్షలు
నింపుకున్న పాత కేలండర్
అవేవి నెరవేర్చకుండానే
కళ్ళు తెరచి మూసేటప్పటికి
నిష్క్రమించింది
నీవేమో కాలాన్ని చంకన పెట్టుకుని
మా ముంగిట్లోకి హడావిడిగా వచ్చేశావు
గతం తాలూకు గాయాలకు
మందులు రాసుకుంటూ
కళ్లల్లో వత్తులేసుకున్న
సామాన్యుడి సణుగుడు విను సంక్రాంతి!

ముంచుకొచ్చిన ప్రకృతి ప్రళయాలను
మరచిపోలేని విలయ దృశ్యాలను
ఇంకిపోయన కన్నీటి చుక్కల తెరలపై
భావరహిత కనుపాపలు కదిలించుకుంటూ
నీరవ నిస్తేజంగా నీరసించిన భోగిమంటల్లో
ఇగిరిపోయన ప్రమోదాల పాలకడవను చూస్తూ
చలించిపోతున్నాడీ బడుగుజీవి
వెంటాడుతున్న వేటగాడు నీ కాలం!

సజీవతంగా పసితనం మలిగిపోతున్నదని
దృష్టి గాజుకళ్లకు పరావర్తనవౌతోందని
అందమైన కలలు నిజాలుగా మారేలోపే
విషాద గీతాన్ని గాలిమోసుకొస్తోందని
కుమిలిపోతున్నాడు.

సంక్రాంతీ చూచావా!
నీ హరిత వనం ఎలా హరించుకుపోయందో?
కలం ప్రశ్నించగలదు కానీ ప్రశ్నించదు
కాలం పల్లవించగలదు కానీ పల్లవించదు
స్వార్థపు అనర్థానికి పూలతల్లి వాడిపోయంది
నొక్కేసిన గొంతుక నోట్లకట్టకు తాకటైంది!

సంక్రాంతీ! ఏమిటీ చాంతాడంత స్వగతం అనుకుంటున్నావేమో?
గతం గతః అనుకోనంటోంది మనోగతం!

భూమి గుండెల్లో అశాంతి తపిస్తున్నది
అసహనం ఉద్విగ్నత కెరటాల్లో విరుచుకుపడుతోంది
అద్దం పగిలిన ముక్కల్లో
ముఖం శతసహస్ర రూపాంతరాలు
అనర్థం చిట్లిన విత్తనాలు
వౌన మార్గం నిండా చురకత్తులు మొలకెత్తాయ
సంక్రాంతీ! మా మనోఘోష వినటానికి
కాస్త ఓపిక పట్టు.
ఎప్పటికప్పుడు భ్రమ లోకంలో పయనిస్తూ
మభ్యపెడుతున్న మాటల మాయా గాజుగోళాన్ని
చూసి మురిసిపోతూ...
నీరవ నిస్తేజ దుప్పటి కప్పుకుని
నిప్పుకోడిలా మారిపోయాం!
భరోసా లేని భవిష్యత్తును
మూటకట్టుకొస్తున్నావా సంక్రాంతీ!
ఈ ఎడారిలో నా మాటలు జారవిడుచుకున్నాను
ఈ బిడారి ఒంటరి పయనం
ఇంకెన్నాళ్లో చెప్పమంటున్నాను!

- బీ.ఎస్.నారాయణ దుర్గ్భాట్టు 9346911199