Others

చిగురులో లోపం... నవ్వుకి శాపం (అందమె ఆనందం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందమైన నవ్వుకి అడ్డంగా నిలిచే పంటి సమస్యల గురించి కిందటివారం చర్చించుకున్నాం. ఇపుడు చిగురు సమస్యలపై వివరిస్తాను.
నవ్వినపుడు అధికంగా కనిపించే చిగురు ((GUMMY SMILE)
సాధారణంగా మనం నవ్వినపుడు, మన పెదాలు పూర్తి విశ్రాంతిలో వున్నపుడు మన పళ్లు 2 మి.మీ. మాత్రమే కనిపించాలి. నవ్వినపుడు చిగురు 2 మి.మీ. మాత్రమే కనిపించాలి. అలా కాకుండా విశ్రాంతప్పుడు పళ్లు 2 మి.మీ. కన్నా అధికంగా, నవ్వినపుడు చిగుర్లు 2 మి.మీ. కన్నా అధికంగా కనిపిస్తే ఆ లోపాన్ని GUMMY SMILE అంటారు. పై పెదవి చిన్నగా ఉన్నా లేక పైదవడ చాలా ఎక్కువ పొడుగ్గా ఉన్నా, నవ్వుకి సంబంధించిన కండరాలు కొంచెం అధికంగా పనిచేయడంవల్ల ఈ లోపం కనబడుతుంది. ఈ తరహా బాధితులు తమ లోపాన్ని కప్పి పుచ్చుకోవడానికి ఎక్కువగా నవ్వరు. చిన్న నవ్వు నవ్వి ఆపేస్తారు. నా దగ్గరికి వచ్చిన ఓ బాధితురాలు నాతో ఇలా అంది. ‘‘కాలేజీలో చేరాక అందరూ నా నవ్వుని చూసి ఎగతాళి చేసేవారు. నాకు చాలా బాధేసేది. ఇంటికొచ్చాక అద్దం ముందు కూర్చొని ఎంతమేరకు నవ్వితే చిగుర్లు కనబడవో చూసుకొని అంత నవ్వు నవ్వేలానే నేను అలవాటు చేసుకున్నా. అపుడు మనసారా నవ్వలేకపోతున్నానన్న బాధ వేసేది. చాలా సంవత్సరాలు అయిపోయేయి. ఇపుడు మనసారా నవ్వాలన్నా నవ్వగలనో లేదో అన్న భయం వేస్తున్నది. ‘నా లోపానికి చికిత్స ఉంది కదా డాక్టర్’ అని దిగాలుగా అడిగింది. లోపం ఎక్కడున్నా దానికి ఆపరేషన్ మాత్రం ఖచ్చితం. చాలామందిలో ఈ లోపానికి కారణం పైదవడ. వీరిలో పైదవడ ఎక్కువ పొడుగ్గా ఉంటుంది. వీళ్ళ పైదవడని కోసి కొంచెం ఎత్తు తగ్గించి తిరిగి అతికిస్తారు. కొంతమందిలో పైపెదవికి ఆపరేషన్ చెయ్యడంవల్ల ఈ సమస్యకి పరిష్కారం దక్కుతుంది. నవ్వుకి సంబంధించిన కండరాల వల్ల ఈ సమస్య కలిగితే వీరిలో BOTOX అనే ఇంజెక్షన్ ఇస్తారు. ఈ ఇంజెక్షన్ ప్రభావం ఒక ఏడాది దాకా ఉంటుంది.
నల్లని చిగురుతో నలుగురిలో నగుబాటు
కొంతమందిలో చిగుర్లు కొద్ది భాగం చాలా నల్లగా వుంటుంది. దీనిని చిగుర్ల హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. ఒక పేషెంట్ తన స్నేహితుల ఎగతాళిని భరించలేక, మానసిక వేదనకు లోనై ఆ నల్లని చిగుర్లు గీసుకుపోయేలాగ రక్తం వచ్చేంతలా టూత్‌బ్రష్‌తో రుద్దాడు. ఇలా చేయటం వల్ల నష్టపోయేది మనమే. దీనికి చికిత్స ఆపరేషన్ అదీ లేజర్‌తో చేస్తే ఫలితాలు బ్రహ్మాండం. ఖరీదు ఎక్కువ.
చిగుర్లు జారిపోవడం
ఇది వృద్ధాప్యంలో మనకి కనిపించే చాలా సాధారణమైన లోపం, కానీ అదే యువతలో కనిపిస్తేనే శాపం. చిగుర్లలో ఇన్‌ఫెక్షన్ కారణంగా చిగుర్లు చనిపోవడం, జారిపోవడం, వాటినుంచి రక్తం రావడం మనకి వీరిలో కనిపించే లక్షణాలు. అశ్రద్ధ చేసినవారిలో చిగుర్లు బాగా కిందకి జారిపోయి పంటిలోని భాగం అంటే రూట్ కనిపిస్తుంది. పన్ను చాలా పొడుగ్గా ఏనుగు పన్నులా కనిపించడంవలన వీరి నవ్వు చాలా అందవికారంగా ఉంటుంది. ఈ లోపంలో గల పెద్ద చిక్కు ఏంటంటే ఇవి ముందు పళ్లు అందులోను క్రింది పళ్లలోనే చాలా ఎక్కువగా కనిపిస్తాయి. చిగుర్లు విపరీతంగా జారిపోయినవారిలో పళ్లు ఊగడం మొదలవుతాయి.
ఈ లోపానికి చికిత్స చెయ్యడం చాలా సంక్లిష్టమైనది. చిగుర్లు ఎంత జారిపోయాయో, పళ్లు ఊగుతున్నాయా లేదా అని పరీక్షించి, ఓ ఎక్స్‌రే ద్వారా పంటిని పట్టుకున్న ఎముక ఎంతమేరకు వుందో అని నిర్థారణ చేసుకోవాలి. చిన్న ఆపరేషన్ ద్వారా చనిపోయిన చిగురుని తీసివేసి, ఎముక తక్కువగా ఉంటే కృత్రిమమైన ఎముకని పంటి చుట్టూ పెట్టి చిగుర్లని కొత్త స్థానంలో కుట్టాల్సి వుంటుంది. ఆపరేషన్ తరువాత పేషెంట్ చాలా శ్రద్ధ వహించాల్సి వుంటుంది. పొగాకు, మందు, విపరీతమైన కారాలు ససేమిరా తీసుకోవద్దు. పళ్లని చిగుర్లని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. అలా చెయ్యని పక్షంలో ఈ చికిత్స విఫలం అవుతుందనడంలో ఏ సందేహం లేదు. బాగా ఊగుతున్న పళ్లని తీసేయడమే ఉత్తమం. తీసిన తరువాత కృత్రిమ పళ్లని (ZIRCONIA) తొడగడం శ్రేయస్కరం. చాలా సందర్భాలలో మన లోపానికి చికిత్స ఉందని తెలీకపోవడమే ఓ పెద్ద శాపం. ఈ శాపం నుంచి విముక్తిపొందాలంటే ఈ చికిత్సల గురించి అవగాహన పెరగాలి. మీరు చదవడమే కాదు మీరు చదివింది అవసరం వున్న చోట చెప్పడం బాధితులకు ఎంతో మేలు చేస్తుంది.
chitram...
GUMMY SMILE చికిత్సకు ముందు, తరువాత ఇలా ఉంటుంది

హైపర్ పిగ్మెంటేషన్ చికిత్స ముందు, తర్వాత ఇలా ఉంటుంది

పాఠకులకు విజ్ఞప్తి
‘‘మీ సమస్యలకు, సందేహాలకు సమాధానాలు’’ పొందాలనుకుంటే ప్రశ్నలు ఈ చిరునామాకు క్లుప్తంగా పంపండి. వాటిని భూమికలో ప్రచురించడం జరుగుతుంది. మీ ప్రశ్నలను ‘‘మీ సందేహాలు- నా సమాధానాలు’’
అనే శీర్షికకు పంపాలి.
చిరునామా : డా శ్రీరంగం రమేష్, ఫేస్ క్లీనిక్, 1-3-15,
కలాసిగూడ, సికింద్రాబాద్-
500003

-డాక్టర్ రమేష్ శ్రీరంగం

సెల్ నెం: 92995 59615

-డాక్టర్ రమేష్ శ్రీరంగం