AADIVAVRAM - Others

డబ్బు- ఓ చిన్నమాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితం అంటే డబ్బు కాదు. కానీ జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. డబ్బు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నప్పుడు డబ్బే జీవితమని ఎవరైనా అనుకుంటే చాలా ప్రమాదం. అలా ఆలోచించిన వ్యక్తులు డబ్బు సంపాదించే క్రమంలో తమ జీవితాన్ని కోల్పోతారు. డబ్బు కత్తిలాంటిది. దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే అది ఉపయోగపడుతుంది. లేకపోతే గాయం చేస్తుంది. ఈ విషయాలను గుర్తు పెట్టుకుని డబ్బుని సంపాదించాలి.
డబ్బుతో కొనలేనిది కాలం ఒక్కటే. ఇది పాత నానుడి. డబ్బుతో కాలాన్ని కూడా కొనుక్కోగలం. ఇది కొత్త నానుడి. వినడానికి ఇది చాలా అసంబద్ధంగా అన్పిస్తుంది. కాని ఇది వాస్తవం. ఈ విషయం తెలుసుకొంటే జీవితంలో డబ్బుని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలుస్తుంది.
మా బాపు ఆయుర్వేద డాక్టర్. కషాయం ఆయనే తయారుచేసేవాడు. మాత్రలని ఆయనే తయారుచేసేవాడు. దానివల్ల ఆయన రోగులను చూసే సమయంకన్నా వీటికే ఎక్కువ సమయాన్ని కేటాయించేవాడు. డబ్బులు సంపాదించిన తరువాత నలుగురు మనుషుల్ని ఉద్యోగంలో నియమించాడు. ఇద్దరు కషాయం తయారుచేసే వాళ్లు. మిగిలిన ఇద్దరు మాత్రలను తయారుచేసేవాళ్లు. దీనివల్ల రోజు రెండు గంటల సమయాన్ని అతను సంపాదించాడు. ఈ సమయం వల్ల మరో పది మందికి వైద్యం అందించే పరిస్థితి ఏర్పడింది.
ఓ మంచి డాక్టర్ రైల్లో ఢిల్లీ వెళ్లి హైదరాబాద్‌కి తిరిగి రావాలంటే కనీసం మూడు రోజులు పడుతుంది. అతను విమానంలో ప్రయాణం చేస్తే ఒక్కరోజులో తిరిగి రాగలడు. మిగతా సమయాన్ని ఇంకా ఉపయోగకరంగా ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నైనా చెప్పవచ్చు.
డబ్బుతో కాలాన్ని కొనుక్కోవడం అంటే ఇలా అన్న మాట. మన దగ్గర ఎంత డబ్బున్నా ఒక్క సెకను కాలాన్ని నిజానికి కొనలేం. కానీ వేరే వ్యక్తులు చేయగలిగే పనులని వాళ్లకి అప్పగించడం వల్ల మన సమయం ఆదా అవుతుంది. ఇది ఒక రకంగా కాలాన్ని కొనుక్కోవడం లాంటిదే. దీనివల్ల కొంతమందికి ఉద్యోగం ఇచ్చిన వాళ్లం కూడా అవుతాం.
అందుకే హాస్పిటల్స్‌లో రక్తపోటు పరీక్షలు, సూది మందులు ఇవ్వడం లాంటివి డాక్టర్లు కాకుండా సిస్టర్లు చేస్తూ ఉంటారు.
డబ్బు ముఖ్యమైంది. కాలం ఇంకా ముఖ్యమైంది. డబ్బు వేటలో పడి కాలాన్ని పోగొట్టుకుంటే అది తిరిగి రాదు. కొన్ని పనులకి వ్యక్తులని నియమించుకోవడం వల్ల సమయాన్ని ఆదా చేయగలం. ఆదా చేసిన సమయాన్ని సద్వినియోగం చేసినప్పుడే దానికి సార్థకత.

-జింబో 94404 83001