AADIVAVRAM - Others

శ్వాస-ఆనందం (సండేగీత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాణాయామం గురించి చాలామంది గురువులు ఎన్నో విషయాలని చెబుతున్నారు. అది ప్రాణాయామం కావొచ్చు. అనులోమ్, విలోమ్ కావొచ్చు. సుదర్శన క్రియ కావొచ్చు. ఇవన్నీ గాలి పీల్చుకోవడం గురించిన వ్యాయామాలు. ఈ గాలి పీల్చుకునే వ్యాయామం వల్ల రక్తపోటు తగ్గుతుంది. మధుమేహ వ్యాధి దూరమవుతుంది. కాన్సర్ లాంటి వ్యాధులు కూడా రావు. ఈ ప్రక్రియ వల్ల మన శరీరంలోని అన్ని కణాలు ఆరోగ్యవంతంగా ఉండి మనిషిని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని తెలిసి కూడా ఈ వ్యాయామం చేయని వ్యక్తులు ఎందరో. పావుగంట నుంచి అరగంట సమయాన్ని ఈ ప్రక్రియకు కేటాయించని వ్యక్తులు మరెందరో.
ఈ వ్యాయామం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఆరోగ్యంగా ఉండే మనిషి ఆనందంగా ఉంటాడు. 2600 సంవత్సరాల నుంచి ఈ వ్యాయామం ఒక తరం నుంచి మరో తరానికి అందుతూనే ఉంది. ఈ ప్రక్రియ గురించి ‘అనపనసలు సుత్త’లో పేర్కొన్నారు. శ్వాస ద్వారా ఉన్నతిని చేరుకునే విషయాన్ని అందులో చెప్పారు. గౌతమబుద్ధుడు ఈ విషయం గురించి చెప్పాడు.
శ్వాసని లోపలికి తీసుకోవడం వల్ల నేను ఆనందంగా ఉన్నాను. శ్వాసని బయటకు వదిలిపెట్టడం ద్వారా నేను ఆనందంగా ఉన్నాను.
ఈ రకంగా అనుకుంటూ ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకుంటే మనిషి ఆనందంతో తేలియాడుతాడు. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ప్రక్రియ మన దేశంలో కొనసాగుతోంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తమైంది.
ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియ వల్ల మనిషి మెదడు తేలికవుతుంది.
మన పూర్వీకులు మనకు ఇచ్చిన ఉచిత టానిక్ ఈ ప్రక్రియ. కొన్ని తరాల నుంచి మనకు వచ్చిన ఈ ప్రక్రియని ఉపయోగించుకొని ఆనందంగా ఉండటం మనపై వున్న బాధ్యత.
ఉచ్ఛ్వాస నిశ్వాస ఆనందానికి హేతువు.