Others

సొగసు సోయగాలకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గులాబీ ని ఆహారంగా, ఔషధంగా తీసుకోవడంవల్ల చాలా రుగ్మతలకు నివృత్తి కలుగుతుంది. పరిమళాలు వెదజల్లే గులాబీల నుంచి సంగ్రహించిన రోజ్‌వాటర్‌ను ఆహార పదార్థాలతో వాడుకోవచ్చు. అనేక రకాలైన స్వీట్స్ తయారీలో వినియోగించడమే కాక దేవుడికి నివేదించే ప్రసాదాల్లో కూడా రోజ్‌వాటర్ ఉంటుంది. ఈ సువాసనాభరితమైన ద్రవంలో ఔషధ, సౌందర్య గుణాలు పుష్కలంగా వున్నాయి. వివిధ రకాల విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్‌తో కూడుకున్న రోజ్‌వాటర్‌లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కూడా ఉండడం. అలాగే గులాబీల నుంచి సెంట్ తయారుచేయవచ్చు. శరీరంలోని వేడి తగ్గించడానికి గులాబీలు చక్కగా పనిచేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తగినన్ని గులాబీ రేకులు, తేనె కలిపి సుమారుగా పది రోజులపాటు ఎండలో పెట్టి బాగా కలియపెట్టిన మిశ్రమాన్ని రోజూ తీసుకుంటే చలువ చేస్తుంది. అజీర్ణం, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలనుంచి దూరంగా ఉండడానికి కొన్ని గులాబీ రేకులను నీళ్లలో మరగకాచి వడపోసి చల్లార్చిన నీటిని ఔషధంగా వాడి అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చు. పలు మూత్రకోశ వ్యాధులకు, జ్వరానికి రోజ్‌వాటర్‌ను మందుగా వాడడం ఉత్తమం. కళ్ళ మంటలు, దురదలు, కలక లాంటి సమస్యలు చిటికెలో మాయమవ్వాలంటే కడిగిన గులాబీ పువ్వును కనురెప్పలపై పెట్టుకుని అరగంట పడుకుంటే సరిపోతుంది. చల్లని నీళ్ళలో గులాబీలను కాసేపు నాననిచ్చి ఆ నీటితో కళ్ళు కడుక్కున్నా ఎంతో ప్రయోజనం ఉంటుంది. రక్తశుద్ధికి, వృద్ధికి దోహదం చేసే గులాబీలను దుమ్ము ధూళి లేనివి, స్వచ్ఛమైనవి ఎన్నుకుని వాడుకోవాలి. చూడముచ్చటగాను, వంటకాల రుచి సువాసనలకు ఔషధంగానూ ‘బేష్’ అనిపించే గులాబీ సౌందర్య పోషణలో కూడా చక్కగా పనిచేస్తుంది. స్నానానికి వాడే సున్నిపిండిలో ఆరపెట్టిన గులాబీ రేకుల పొడిని కలిపి వాడుకుంటే ఘుమఘుమలాడుతూ, మెరుపులీనుతున్న చర్మం సొంతమవుతుంది. మామూలుగా వాడే కొబ్బరి నూనెలోనే గులాబీ పువ్వుల రేకులను కలిపి ‘సెంట్’ తయారుచేసుకున్న విధంగానే గులాబీ నూనెను తయారుచేసుకోవాలి. గులాబీ నూనె రోజూ వాడడంవల్ల వెంట్రుకలు రాలడం, కంటి సమస్యలు, తలనొప్పులను నివారిస్తుంది. వంటికి చలవ చేస్తుంది.