Others

తనువు భారమే యమగండం అయింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన తనుభారం భర్తకీ, తనకీ చావును తెస్తుందని ఆ ఇల్లాలు అనుకోలేదు. గానీ.. అరవై ఎనిమిది సంవత్సరాల స్థూలకాయురాలు మంజులా విఠ్లానీ బరువు 128 కిలోలున్నా ఆ వర్రీ భర్త నట్వర్‌లాల్‌కు లేదు. ఆ యిద్దరూ ఇంటి క్రింద అంతస్థులో, వారి కుమారుడు ఆశీష్, కోడలు నిశాలు పైఅంతస్తులో రాజ్‌కోట్‌లోని కల్వాడీలో ఓ బంగ్లాలో వుంటున్నారు. మొన్న సోమవారం ఆశీష్‌కు సుస్తీ చేసింది. తెల్లారగట్ల నాలుగు గంటల వేళ భర్త ఆయాసం ఎక్కువయిందీ అని మందు బాటిల్‌కోసం నిశా క్రిందికిరాగా- కొడుకు రోగం ముదిరింది అని తెలుసుకున్న తల్లి మంజుల హడావుడిగా మెట్లమీదికి దారితీసింది. ఆమె వెనుకే భర్త- ‘‘పడిపోతావమ్మాయ్! జాగ్రత్త’’ అంటూ నట్వర్‌లాల్ కూడా పరుగుపెట్టాడు.
ఆదుర్దాలో మంజుల అడుగు తడబడి మెట్టు తప్పి, కాలు జారి, వెనుకనే వున్న భర్తమీద పడిపోయింది. ఇద్దరూ క్రిందికి దొర్లిపోగా- భార్య శరీరం క్రింద పడ్డ నట్వర్‌లాల్ శరీరం బాగా నలిగిపోయింది. కోడలు పరుగు పరుగున దిగి, ఆ ఇద్దరినీ ఆసుపత్రికి హుటాహుటీ తీసుకుపోయింది. కానీ భర్త ప్రాణాలు దారిలోనే పోయాయి. భార్య మెదడు చిట్లిపోయి మరి కోలుకోలేదు.
‘‘మంజులమ్మకి కడుపు తీపి ఎక్కువ. కొడుకంటే ప్రాణం ఆ తండ్రికి. అదే వాళ్ల ప్రాణాలు తీసింది’’ అన్నారు యిరుగూ పొరుగూ సానుభూతి ప్రదర్శిస్తూ.