Others

మధ్యలో వెంట్రుకైనా వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక శ్వాసకు మరొక శ్వాసకు
మధ్య దూరాన్ని గణించడమంటే
ఒక జననాన్ని ఒక మరణాన్ని లెక్కించడమే
విధ్వంసం జరిగితేనే
నిర్మాణానికి హస్తరేఖలు కలుసుకుంటాయ

దూరదూరంగా జరుగుతున్నారంటే
బ్రహ్మజెముడు మొక్కలు రక్తం చిందిస్తున్నట్టే
ఒంటరిగా ఉన్నప్పుడు మన గుండెచప్పుడే
భయంకర మృత్యునాదవౌతుంది

గొంతులో శబ్దం ప్రశ్నలా
రూపాంతరం చెందుతోందంటే
ఒక మనిషి తయారవుతున్నట్టే
ఎక్కడో ఉన్న కుర్చి దేహంపై మెరుపులు మెరిసి
మరకలను వదిలేసిపోతాయ
అతని చూపు పాము పాకినట్టు పాకుతుంది

విభజించడమంటే పుస్తకాన్ని మధ్యలోకి తెంపడమే
కుల మత ప్రాంత ఆయుధాలు వాడి దగ్గరుంటే ఏంటి?
నేను మీ మధ్యలో సాలీడు పురుగును వదులుతాను
సునామిలొచ్చిన తెగిపోని సాలేని మీ మధ్యలో నేస్తుంది
గాలికి ఊగే ఆకుల్లో జీవితాన్ని దర్శించుకోండి
చెట్టు నుండి రాలే ఆకును చూడటమెందుకు?
ఆకు వదిలేసిన స్థలంలో నువ్వు చిగురిస్తే
కాలం పచ్చపచ్చగా నువ్వు తడితడిగా

దూరాన్ని లెక్కిస్తే కిరణాలు మీ దేహాలపై
ఎలా ప్రతిష్ఠింపబడతాయ?
నదులెలా మీ నాలుకలను ముద్దాడుతాయ?
మేఘం మీతో ఎలా సంభాషిస్తుంది, చినుకు చినుకుగా

పదానికి పదానికి మధ్య దూరాన్ని పెంచడమెందుకు?
రెండు పదాలను ఒకటి చేయలేనివాడు
కవిత్వం ఎలా రాయగలడు?
కవిత్వమెప్పుడూ అడవిలా చిక్కగా ఉండాలి..
శబ్దాలు వినపడుతున్నాయంటే
దూరాన్ని నువ్వు హత్యచేసినట్లే
గడియారంలో మూడు ముల్లుల మధ్య పోరాటం
దూరాన్ని దగ్గరకు చేయడానికి
ఏ ఇద్దరి మధ్య ఒక వెంట్రుక మొలిచినా
ఎడారి విస్తరించినట్టే
వెంట్రుకను పెకలించి నవ్వును నాటండి

దూరదూరంగా జరగడానికి
అవకాశాన్ని ఇవ్వకండి
దూరాన్ని చంపే నా అక్షరాన్ని మీకు అందిస్తున్నా
దగ్గరగా జరుగుతారు కదూ!

- అఖిలాశ, 7259511956