Others

ఎక్కడెక్కడో వెతుకుతున్న!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తీసి పారేసే గడ్డిపరక కూడా
కొన్ని వాక్యాలను చేతికందిస్తుంది
కట్టెపుల్ల కూడా కవిత్వాన్ని
పలికించగలదని
ఇప్పుడిప్పుడే తెలుస్తుంది!

ఎప్పుడూ
ఏదో తెలియనితనాన్ని
ఎక్కడినుంచో పట్టుకొచ్చి
నా కవితా వాక్యాలకు
గంధంలా పూస్తున్నాను కానీ
ఆరాటంగా కవిత్వం చేయాలని
భ్రమలకు పోతున్నా కానీ
కవిత్వమంటే జీవితమని
ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నా!

ఎక్కడెక్కడో వెతుకుతున్నా
అనవసరంగా కొన్ని పదాలను
అతుకుతున్నా గాని సంతృప్తి కరువు
నిప్పులతో కూడిన పదాల వంతెనపై
బుడిబుడి అడుగులు వేస్తున్నా కాని
తేలిక పదాల కవిత్వాన్ని
తెలుసుకోలేకపోతున్నా!!

ఎక్కడెక్కడో వెతుకుతున్నా గాని
పక్కపక్కనే ఉన్న సంగతులను
కవిత్వంగా మార్చలేకున్న!

ఇకనైనా
వెతకడం మాని, అతకడం మాని
జీవితాల సారాన్ని
నా కలం సిరాగా నింపుకోవాలనుకుంటున్నా
ఆ భావాలను కాగితం వేదికలపై
సన్మానించాలనుకుంటున్నా...

- గుండు కరుణాకర్, 9866899046