Others

తిరోగమనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడవి జంతువుల నుండి రక్షణకై
తయారుచేసుకొన్న ఆయుధం
తన ప్రాణాలనే కబళిస్తుంది

ఆకులను వస్త్రంగా చేసుకొని
నాగరికుడైన నరుడు
విచ్చలవిడి స్వేచ్ఛతో
అందాలను తూర్పారబడుతూ
అనాగరికుడవుతున్నడు

మనుగడ కోసం గుంపులుగా
ఏర్పడ్డ మానవుడు
ఆధిపత్యం, అధికారం వేటలో
కుల, మత, వర్గాలుగా విచ్ఛిన్నమవుతున్నడు

సంఘజీవిగా మారి
అభివృద్ధి బాట పట్టిన మానవుడు
సామాజిక మాధ్యమాల ఉచ్చులో
ఒంటరైపోతున్నడు

అనురాగాల బంధంలో
కుటుంబం ఏర్పరచుకున్నవాడు
కోరికల వలయంలో చిక్కి
బంధాలకు తూట్లు పొడుస్తున్నడు

పర్యావరణాన్ని ఆరాధించినవాడు
స్వార్థజీవియై
పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నడు
తన మనుగడనే
ప్రశ్నార్థకం చేసుకుంటున్నడు

‘మనీ’తోనే జీవితమని తలిచి
మనిషినని మరిచిపోతున్నడు

పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు
మితిమీరిన నాగరికత
తిరోగమించనుందా?

- గుండు కరుణాకర్, 9866899046