Others

చైనాలో చేప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేప ఎక్కడైనా చేపే
కాని అది చైనా చేప,
తదేకంగా ననే్న చూస్తుంది.

చిన్నప్పటి నుంచి
ఒక నిశ్చల దృక్కు
నాకు గుచ్చుకుంటూనే వుంది.
వదిలించుకొని
మరో జీవితంలోకి
ఈదుకుంటూ వెళ్లిపోయాను.

ఇవాళ దేశంగాని దేశంలో
వరల్డ్ చెయన్ హోటల్లో
రివాల్వింగ్ టేబుల్ మీద పడుకొని
తెల్లని పొలుసుల్తో
ధగధగా మెరుస్తుంది
చుట్టూ తిరుగుతూ
మాటిమాటికీ ననే్న చూస్తుంది.
నిజానికది
నాలో పాతుకున్న చూపుకు
వేలాడుతున్నట్టుగా వుంది.

చేపే కాదు
అది పడుకున్న పళ్ళెం
పళ్ళెం చుట్టూ వ్యాపించిన ఘుమఘుమలు
ఇలా
యావత్ భ్రమణమంతా
నాపైనే కేంద్రీకృతమైనట్టుగా వుంది.
దాని కన్నుల్లో
పసిఫిక్ మహాసముద్రం తళుకులున్నాయ
హిందు మహాసాగరం నీడలు కూడా.

టర్న్ టేబుల్
ప్రతి వారిముందూ కాసేపు ఆగుతుంది.
ఇప్పటిదాకా చేపను
ఎవరూ పట్టించుకోలేదు
మెల్లగా కదిలించి చక్రం
హఠాత్తుగా పోర్కులు
దాని డొక్కలో దాడి చేశాయ.
నొప్పి కనపడకుండా
అది నావైపు చూస్తూనే వుంది
ఒక రకమైన వొగరువాసన
గది నిండా వ్యాపించింది.

ఇంతలో దాని తలపై
ఓ పిడుగు పడింది
అంతే! పరిసరాల్లో
చూపు లేని చీకటి అలుముకుంది.
అన్నం తినబుద్ధి కాక
లేచి నిలబడ్డాను.

- డా. ఎన్. గోపి