Others

ప్రశ్నార్థక ప్రతిమలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వత్సరపు పర్వదశమీ సాయం సమారోహోత్సవ వేదికపై
పరిపరి విధ ప్రతిమల్ని తిలకించిన నాకు
కనిపించిన ప్రతి ప్రతిమలో స్ఫురించింది విస్మయం!
వినిపించిన ప్రత్యాలోచనలో ధ్వనించింది తిరోగమనం!

శాశ్వత మైత్రీ శత్రుత్వాలు లేవనే
అవకాశవాద రాజకీయ నూతన నిర్వచనం!
ఎంతలేసి మాటలనుకున్నా ఎంతైనా మనమంతా ఒక్కటే అనుకుని
అందరం కలిసి అపజయాన్ని కలిగిద్దామనే
అసంబద్ధ రాజకీయ సమీకరణలతో
రంగుల రాజక్రీడగా రాజకీయాల్ని దిద్దుతూన్న
చీడబట్టిన వ్యాధిగ్రస్థ వ్యవస్థ నిర్మాతల ప్రతిమలు!

అంతర్జాలంలో అశ్లీల, అభ్యంతరకర చిత్రాలను
ఆనందిస్తూ అబ్బురపడిపోయే
భావితరాల బాలల బొమ్మలు!

తొమ్మిదో తరగతికే తొందరపడి ముందే కూసిన
పడుచు కోయల ప్రతిమ
పరువు పోతోందని అల్లుణ్ణి,
పరువు తీసిందని కూతుర్ని,
పరువు హత్య చేసి పరువు పోగొట్టుకొంటున్న
నరరూప రాక్షస ప్రతిమలు.

ఆచారం, ఆచారం అంటూ
కర్రలతో బుర్రలు పగుల కొట్టుకునే భక్తులు,
ఆనందం, ఆనందం అంటూ జంతు పరుగుల నిలువరించే
జల్లికట్టు హింసాత్మక పోటీదారులు,
సంప్రదాయానికి, సమానావకాశానికి మధ్య
పంబాతీర ప్రాంగణ
ఆవేశాందోళనా రూప ప్రతిమలు!!

గత జల సేతుబంధనానంతర
గావుకేకల కాస్టింగ్ కౌచ్, మీటూ, షీటూల
వికృత సంస్కృతీ ప్రతిబింబ ప్రతిమలు!
నిర్వాహకుల నిర్లక్ష్య నిర్వహణ పర్యవసానం
రావణ ప్రతిరూప దహన దర్శన
తన్మయత్వంలో చాలించిన తనువుల
మృత్యుకరాళ నృత్య భంగిమల ప్రతిమలు!

ప్రతి ప్రతిమా - తిరోగమన ప్రతీక
ప్రతి చెడులోంచి ఒక మంచిని
కాంక్షించే జనం, వీక్షించే మనం
నిజమైన ప్రతిమలం - ప్రశ్నార్థక ప్రతిమలం!!

- వేదం సూర్యప్రకాశం, 9866142006