Others

దెయ్యం.. ‘‘ప్లాట్‌ఫామ్’’ అది! ( వార్త-వ్యాఖ్య )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దెయ్యాల కథలంటే అందరికీ యిష్టమేకానీ- దెయ్యాలతో ముఖాముఖీ ఎవ్వరికీ సరదా వుండదు. కానీ పశ్చిమ బెంగాల్‌లోని పురిలియా జిల్లాలో ఒక చిన్న రైల్వే స్టేషన్ వుంది. దాని పేరు ‘‘బేగున్ కోదర్’’. అది కలకత్తా నగరానికి 260 కిలోమీటర్ల దూరంలో వుంది కానీ, దాని ఫ్లాట్‌ఫామ్ మీదికి ప్రయాణీకులు రారు. అక్కడ దిగి ప్రయాణీకులు ఎక్కడికీ పోరు. చచ్చేటంత భయం!
ఆ వూళ్ళో కూడా ఆ రైలు స్టేషన్ పేరు చెబితే హడల్. ఎందుకంటే ఆ ప్లాట్‌ఫామ్‌మీద ఒక ఆడ దెయ్యం అతి తెల్లని దుస్తులు ధరించి అర్థరాత్రివేళ సంచరిస్తూ, రైలు పట్టాలమీద షైరు తిరుగుతూ వుండడం చాలామంది చూశారు. ఆ స్టేషన్‌లో పనిచెయ్యమంటే చాలు, ఆగకుండా పరిగెడతారు సిబ్బంది. దెయ్యం పీక్కుతుంటుందని భయం అంటారు. ఉద్యోగం పోతే ‘ముష్టి ఎత్తుకుంటాం’ అంటారు.
ఈ రైలు స్టేషన్‌ని నలభై సంవత్సరాలుగా అలా ‘పాడబెట్టారు’. కొన్ని రైళ్లు ఆగుతాయి గానీ, స్టేషన్ మాస్టర్ జెండా వూపడం లాంటిది వుండదు.
ఓ సాహసి ఒకసారి ఈ ఫ్లాట్‌ఫారమ్ మీద ఉద్యోగం చేస్తానని ఒప్పుకున్నాడు. ఏదో దెయ్యం పిలిచినట్లు పోయాడు పాపం- పైకిపోయాడు అంటారంతా..
ఆ సాహసి ఓ రోజు తెల్లారేపాటికి ఫ్లాట్‌ఫామ్‌మీద విగతజీవుడై పడి వున్నాడట! ఇది 1960 నాటి సంఘటన. కాకపోతే 2009లో దీదీ అంటే మమతా బెనర్జీ రైల్వేమంత్రిగా వున్నప్పుడు - ‘‘దెయ్యం లేదూ - భూతం లేదూ, స్టేషన్‌ని ‘చాలూ’ చెయ్యండి’’ అంటూ ఆదేశాలు జారీ చేసింది. అయినా నిర్మానుష్యంగా, దెయ్యాల దిబ్బలాగే వుందా రైల్వే స్టేషన్.
అలావుండగా కలకత్తాలో వున్న ఒక భూత ప్రేత పిశాచాదుల ఉనికి మీద రీసెర్చి చేసే సంస్థవారికి ఒక అయిడియా వచ్చింది. దాన్ని టూరిస్టులకు ఆకర్షణగా పెట్టి పైసలు గుంజవచ్చని- పురిలియా టూరిజం సంస్థ ఐడియామీద నివేదిక చేసింది. ఇక దాని అమలుకి పురిగొల్పింది గవర్నమెంటు. అంతే! టూరిజం కంపెనీవాళ్లు ఎగిరి గెంతేశారు. దేముళ్లని చూసేది కొంతమందయితే, యాత్రగా బయలుదేరి దెయ్యాన్ని చూసేవాళ్లు మరికొందరున్నారు మన దేశంలో. అంచేత వాళ్లు ఒక ఉమ్మడి ప్యాకేజీ ప్రకటించారు. ఈ భూతనగరి స్టేషన్‌ని అర్థరాత్రి చూపించడమే కాదు అక్కడ ఒక గైడ్- దెయ్యాల కథా కాలక్షేపం లాంటివి కూడా పెడతారు. టూరిస్టులకు వసతి, భోజనం, రాకపోకలకు వాహన సదుపాయాలన్నీ కల్పిస్తారు. ‘అమావాస్య’కి స్పెషల్ ఏర్పాట్లున్నాయి.
ఈ ప్రకటనకి మంచి స్పందన వచ్చింది. ఎంతోమంది టూరిస్టులు రిజర్వేషన్ అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఈ నెలలోనే సాహసికులయిన ఆ ప్రయాణీకుల్ని సాదరంగా ఆహ్వానిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ హడావుడీ హంగామా చూసి ఆ దెయ్యం మరో రైలెక్కేస్తే కథే లేదు- ప్రాజెక్టు మటాష్!
................................................................
భూమికకు రచనలు
పంపాలనుకునే వారు రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదా ఈకింది చిరునామాకు పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, భూమిక, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03
................................................................

-వీరాజీ