Others

వెక్కిరింతలకు తాళలేక...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేధించడం, ర్యాగింగ్ చెయ్యడం, వెంటపడి వేళాకోళం చేస్తూండడం, అంగవైకల్యాన్ని పట్టుకుని వెక్కిరించడం లాంటివి బాధితుణ్ణి ఎంతగా నొప్పిస్తాయో- మనిషిగా పుట్టినవాడు ఆలోచించాలి. అది తెలియని దుష్టులు, శాడిస్టులు ఎక్కువైనారు.
ఇటీవల బెంగుళూరులో పోయినవారంలోనే ఒక పధ్నాలుగు సంవత్సరాల బాలుడు, తొమ్మిదవ తరగతి చదువుకుంటున్నవాడు తన అపార్టుమెంట్ భవనం పదో అంతస్తుమీదనుంచి దూకేశాడు.
రౌనక్ బెనర్జీ బాల్డావిన్ బోయస్ స్కూలులో చదువుకుంటూ, స్కూలు బస్సులోనే వెళ్లి వస్తున్నాడు. గానీ, అతని క్లాసులోని పిల్లలు కొందరు బస్సులో కూడా అతణ్ని ఆటపట్టించడం సాగిస్తున్నారు. వెంటాడి వేధింపులు చేసేవారుట. తాను ఎంతగానో యిష్టపడ్డ అతని క్లాసుమేట్స్ కూడా అల్లరి గ్యాంగుతో కలిసి సతాయించడంతో ఆ కుర్రాడిలో సహనశక్తి మాయమయిపోయింది.
అంతే! 29వ తేదీనాడు స్కూలునుంచి ఇంటికి వస్తూనే అవమానభారం తట్టుకోలేక పుస్తకాలు అక్కడ పడేసి, పదవ అంతస్తు టెర్రస్‌మీదనుంచి అమాంతం క్రిందికి దూకేశాడు. చనిపోయేముందు ఒక చీటీ కూడా రాసిపెట్టిపోయాడు రౌనక్.
తల్లిదండ్రులు కొంతకాలంగా రుూ వేధింపుల సంగతి తెల్సుకుంటున్నారు గానీ బిడ్డ యింత దారుణానికి పూనుకుంటాడని వూహించలేకపోయారు. స్కూలు బస్సులో తనని ఏడిపిస్తున్న విద్యార్థి పేరు తమ పిల్లవాడు తరచూ చెప్పేవాడు. అలాగే మరికొందరు వున్నారు. వీరిపై చర్య తీసుకోవాలంటూ ఆ పిల్లవాడి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
దౌర్జన్యానికైనా తట్టుకోగలరేమోగానీ, వేళాకోళం చేస్తే తట్టుకోలేరు సున్నిత హృదయులు. ఈ సంగతి వార్తలద్వారానైనా తెల్సుకొని కొంతమంది అయినా సంస్కరించబడితే చాలు!