Others

అద్దం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్దంలో...
మనల్ని మనం చూసుకున్నప్పుడు
అమ్మ ఒడిని చేరినంత ఆనందం!

ఒంటరిగా...
దాని ముందు నిల్చుంటే చాలు
చిన్న పిల్లలమైపోతాం!
మన వదనాన్ని
పురివిప్పిన మయూరిలా
నాట్యమాడిస్తూ... వెక్కిరింతలతో...
దానికి చెక్కిలిగింతలు పెడతాం!

ఎంత గొప్పది అద్దం!
అబద్ధమసలే ఎరుగదు!
అంతా నిజమే చూపుతుంది!

ఇంట్లో అందరితో మమేకం
దాని పెద్దరికానికేం కొదువలేదు!
గడప దాటి వెళ్లినా
తిరిగి గుమ్మంలో అడుగిడినా...
మొదట దానినే
దర్శించుకొమ్మంటుంది!

అద్దం దుమ్ముతో
మసక బారినప్పుడు...
మబ్బున మాటున దాగిన
శశిని తలపిస్తుంది!

గాయాలతో -
అది ముక్కలు చెక్కలైనా...
ప్రతి ముక్కలో
ఎంచక్కా...
మన మోమును చెక్కుచెదరకుండా
పక్కాగా పదిలపరుస్తుంది!

- దాస్యం సేనాధిపతి, 9440525544