Others

అరిగిన వేలిముద్రలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరచేతిలో
వైకుంఠం చూడలేకున్నా
దిక్కుచూపే ఐదువేళ్ల
హస్త సాముద్రికాన్ని
భవిష్యత్ చిత్రపటాన్ని
దర్శించే ఆశాజీవుల
భ్రమావరణంలో
ఇక దిక్కులే మాసిపోతే?
మీటలు నొక్కి నొక్కి
దిక్కు తెలిపే చేతివేళ్లు
రోజూ బట్టలుతికే వేళ్లు
ఆస్తిపాస్తుల లావాదేవీల
నడుమ నలిగిన
బొటనవేలి ముద్రలు
బయోమెట్రిక్ హాజరీపై
నొక్కి వెళ్లే చేతివేళ్లు
ఆధార్ కార్డు కోసం
వేసిన వేలిముద్రల అచ్చులు
మనందరి జీవన భద్రతకే
ఆధారమంటున్న ప్రభుత్వాదేశం!
వయస్సు మీరి
శరీరం శిథిలమై
జ్ఞాపకాలపై
మబ్బు తెరలు కమ్ముకుంటున్న
దశలో యవ్వనోత్సాహాన్ని
పుంజుకునే యత్నం
మరో నూతన అధ్యాయాన్ని
లిఖించే కాగితాలపై
చెరగని జీవితకాలపు
ముద్రలు ముద్రించాలనే ప్రయాస
చావని కోరికల మీద
చివరికి మిగిలేవి
అరిగిపోయన వేలిముద్రలే!

- నిఖిలేశ్వర్, 9177881201