AADIVAVRAM - Others

అబ్దుల్ కలామ్ (ప్రముఖ శాస్తవ్రేత్తలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళనాడులోని రామేశ్వరం, శివాలయం దగ్గరలో 1931లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అబ్దుల్ కలామ్, తన మత గ్రంథమైన ఖురాన్‌తోపాటు రామాయణ, భారత, భాగవతాలను కూడా చక్కగా ఔపోసన పట్టేశాడు. తండ్రి జైనులాబుద్దీన్, తల్లి ఆషియమ్మలు కూడా చాలా నిరాడంబరులు. బాల్యం అంతా రామేశ్వరంలోనే గడిచింది. కలామ్ అన్న ముస్త్ఫాకి ఒక కిరాణా కొట్టు ఉండేది. ఖాళీ సమయాల్లో అక్కడ పనిచేసేవాడు.
తండ్రి ప్రోత్సాహంతో తిరుచినాపల్లిలో డిగ్రీ చదివి, తరువాత చెన్నైలో ఇంజనీరింగ్ చదివి 1958లో డిఫెన్స్ శాఖలో సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్‌గా 250 రూపాయల జీతానికి ఉద్యోగం చేశాడు.
తన నిరంతర పరిశోధనలతో భారత అంతరిక్ష శాఖలో అద్భుతాలు సాధిస్తూ అగ్ని, పృథ్వి, ఆకాష్, త్రిశూల్, నాగ్ వంటి రాకెట్ల రూపకల్పనలో ముఖ్య పాత్ర వహించి దేశ రక్షణకు వెనె్నముకగా నిలిచాడు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘్భరతరత్న’ బిరుదు పొందాడు. అబ్దుల్ కలామ్ పొందిన బిరుదులు, డాక్టరేట్లకు లెక్కేలేదు. భారత ప్రభుత్వ రక్షణ శాఖకు ప్రిన్సిపల్ సైంటిఫిక్ సలహాదారుగా పని చేశాడు.
అత్యంత నిరాడంబరంగా ఒక చిన్న గదిలో తన పుస్తకాలతో కాలం గడిపే కలామ్‌కి 1990లో జాదవ్‌పూర్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ ప్రకటించినప్పుడు తన పేరుతోపాటు నెల్సన్ మండేలా పేరు కూడా ఉందని తెలుసుకుని, ‘అంతటి మహనీయుడితో తాను సరితూగననీ, ఆయనతోపాటు ఇవ్వవద్దని’ కోరాడు. అందుకా యూనివర్సిటీ వారు అంగీకరించలేదు.
మధురై కామరాజు యూనివర్సిటీ స్నాతకోత్సవ ఉపన్యాసం చేయడానికి ముందు తన గురువైన దొరై సోలమన్ గారిని వేదిక మీదకు పిలిపించుకొని ఆయన పాదాలకు నమస్కరించి మరీ తన ఉపన్యాసాన్ని ప్రారంభించాడు.
డాక్టర్ కలామ్ తన ఆత్మకథను ‘ది వింగ్స్ ఆఫ్ ఫైర్’ అనే పేరున వెలువరించాడు. దానిని ‘ఒక విజేత ఆత్మకథ’గా తెలుగులో అనువదించబడి ఎన్నో ప్రశంసలు పొందింది. శేష జీవితంలో అనేక విద్యాలయాలలో ప్రసంగించే వ్యాపకం పెట్టుకున్న మహనీయుడు అబ్దుల్ కలామ్ 2015 జూలై 27న షిల్లాంగ్‌లో మరణించాడు.

-పి.వి.రమణకుమార్