Others

ఇంచక్కా ‘ఇ స్కోలుకి’- షెరపోవా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెన్నిస్ స్టార్ మారియాషెరపోవా- టెన్నిస్ రంగంలో పదకొండు సంవత్సరాలపాటు అందరికన్నా ఎక్కువ పారితోషికం తీసుకునే ఆటగత్తెగా పేర్గాంచిందని అందరికీ తెల్సు. డోపింగ్ పరీక్షలో ఆమె మాదకద్రవ్యాలు వాడిందని తేలడంతో సమాఖ్య ఆమెకు యిటీవల రెండు సంవత్సరాలు ఫస్ట్‌క్లాసు టెన్నిస్‌నుంచి నిషేధించింది. దీనితో హతాశురాలయిపోక- దుఃఖంనుంచి తేరుకుని మారియా షెరపోవా తిన్నగా అమెరికాలోని హార్వర్డ్ బిజినెస్ స్కూలు (బోస్టన్)లో- డిగ్రీ తరగతిలో జాయినయిపోయింది.
ఎలా జరిగిందో తెలియదు గానీ హార్వర్డ్‌లో ‘‘స్టూడెంట్‌నయిపోయానోచ్’’, అంటూ ఆమె ఫేస్‌బుక్‌లోనూ, ట్వీట్స్‌లోనూ- ఉల్లాసంగా కనబడుతూ, బొమ్మలు పెట్టింది. జీవితం ఓటమికోసం కాదు. గెలుపుకోసమే చేసే పోరాటం!

-వీరాజీ