Others

కర్ణ, దుర్యోధనులకు దేవాలయాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాఖండ్ లోయల్లో దుర్యోధనుడికి 13 దేవాలయాలు వున్నాయి. దక్షిణాన, కేరళలో దుర్యోధనుడికి- మాలనాడా- కోలమ్ దగ్గరలో వుంది- అక్కడ కూడా, జ్యేష్ఠాషాడ మాసాలలో జాతరలు జరుగుతాయి. అయితే, ఉత్తరాఖండ్ లోయల్లోని మందిరాలలో దుర్యోధనుడు లేదా సుయోధనుడు అన్న పేరు ఒక్కచోటే వుంది. మిగతాచోట్ల రుూ కౌరవ చక్రవర్తిని సుమేష్, లేదా సోమేశ్వర్ అన్న పేర్లుపెట్టి పూజలు చేస్తారు. ఐతే, ‘జఖోళీ’ దుర్యోధన లేదా సుయోధనాలయానికి కొంచెం దూరంలోనే ‘నేట్వార్’ గ్రామంలో సుయోధన మిత్రుడు దాన వీర శూర కర్ణుడికి దేవాలయం వుంది. అసలు ఉత్తరాఖండ్‌లో హిడింబికి తొమ్మిది దేవాలయాలున్నాయి. జఖోళీ గ్రామంలోని పర్వతం మీద వున్న గుడిలో శక్తిమాత దేవాలయంలో దుర్యోధనుడు పూజలు చేసేవాడు. ప్రక్కనే అతనికి కూడా ఒక చిన్న గుడి వుంది. ఆ గుడిలోని అమ్మవారు దుర్యోధనుడికి బంగారు గొడ్డలి ఒకటి ఆయుధంగా ప్రసాదించిందని కూడా అంటారు. కర్ణుడి దేవాలయంలో, నేట్వార్ గ్రామంలో పూజలు, ఆరాధనలు, జాతరలు జోరుగా సాగుతున్నాయి. గ్రామస్థులంతా దానకర్ణుడి ఆదర్శంగా వరకట్నాలు నిషేధించారు. జంతు వధ లేదు. విరాళాలు యిచ్చి గుడిని గౌరవించుకుంటారు. ఎవరి పెళ్లిఅయినా అది గ్రామ ఉమ్మడి ఖర్చుతోనే చేస్తారు.
ఐతే, కౌరవ చక్రవర్తి గుడిలో మాత్రం పూజలు లేవు. పూజారి మాత్రం వున్నాడు. గ్రామస్థులు కీడు జరుగుతుందేమోనన్న భయంతో సుయోధన ఆలయాన్ని శివాలయంగా కూడా కొంతకాలం మార్చేసుకున్నారు. కాకపోతే బంగారు (మలామా) గొడ్డలికి ఏటా జాతరలు, పూజలూ చేస్తారు. కాని దక్షిణాదిన కేరళలో కొల్లం జిల్లాలో- మాలనాడ్ గ్రామంలో భారీగా జాతరలు జరుగుతాయి. దానికో కథ వుంది.
పాండవులు వనవాసంలో వుండగా దుర్యోధనుడు- అర్జనుడి దగ్గర గల ఒక ‘‘శక్తి ఆయుధం’’కోసం కర్ణుణ్ని తీసుకుని- పాండవులను వెతుక్కుంటూ రుూ కేరళ ప్రాంతాలకు వచ్చారట. అప్పుడు రుూ దళిత గ్రామంలో ఒక ఇల్లాలు- దుర్యోధనుడు దాహం కోరగా- ‘కల్లు’ తెచ్చి యిచ్చిందిట గానీ అగ్రవర్ణాల వారికి తనచేత దాహం యివ్వడం తప్పు అని తెలుసుకున్న ఆమె- గ్రామానికి కీడు వస్తుందేమోనన్న భయంతో క్రుంగిపోగా దుర్యోధనుడు- ‘అమ్మా! ఆకలిదప్పులు అన్ని వర్ణాలకీ సమానమే. కుల విచక్షణ తప్పు’’- అంటూ ఆ గ్రామంకోసం అక్కడే ఘోర తపస్సు చేశాడట.
ఆ గ్రామానికి నూరు యోజనాల నేలను హక్కు భుక్తం కూడా చేశాడట దుర్యోధనుడు. ఆ విధంగా కుల విచక్షణకు స్వస్తిపలికిన రుూ మాలనాడ మందిరంలోని, ఆ దళిత స్ర్తి వంశానికి చెందినవారే నేటికీ అర్చకులుగా వుంటున్నారు! భారీ ఎత్తు జాతరలకు రుూ గ్రామం పెట్టింది పేరు. టూరిస్టులను అధికంగా ఆకర్షించే జఖోళీ నట్వర్ గ్రామాలకు రవాణా సదుపాయాలు బాగా వున్నాయి.
ఉత్తరాంచల్ లోయలలో మహాభారతంలోని శకునిగారికీ, భీమసేనుడిగారికీ కూడా ‘గుడు’లున్నాయి. జఖోళీ దగ్గరి మోడీ గుడిప్రక్కన గల ‘‘టోన్ నది’’నే తమస్ (చీకటి) నది అని కూడా పిలుస్తారు. ఈ నదిలోని నీళ్లు కౌరవులు కురుక్షేత్రంలో వోడిపోయాక మిగిలినవారు కార్చిన కన్నీళ్లనీ- వాటిని తాకరాదని- అవి ఐదువేల సంవత్సరాలుగా ఉన్నాయని జనాల నమ్మిక.