Others

అమ్మాయితో పరీక్ష రాసిన అమ్మ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చదువుకు వయస్సుతో పనిలేదు. ముంబాయికి చెందిన 44 సంవత్సరాల అమ్మాయి- ఇద్దరు పిల్లల తల్లి ఐనాక- కుమార్తె ‘శ్రుతిక’(16)తో కలిసి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసింది. సెవెరీ ప్రాంతం విఘ్నెశ్వర పురానికి చెందిన సరిత తండ్రి- ఆమె నాలుగో తరగతిలో చదువుతూ వున్నప్పుడే మరణించాడు. దాంతో మిగతా ముగ్గురు అప్పచెల్లెళ్లూ, ఒక తమ్ముడూ- వాళ్ల కష్టార్జితంతోనే సంసారం గడుపుకొచ్చారు. అంచేత పెళ్లి అయినాక గానీ సరితకి చదువుకోవాలన్న కోరిక తీరలేదు. పిల్లలు పుట్టినా, పట్టుదల వదలకుండా ఎనిమిదో తరగతి రాత్రి పాఠశాలలో జాయినయిందామె. పిల్లలతో తానూ చదివింది. టెన్త్ పబ్లిక్ పరీక్ష తల్లీబిడ్డా కలిసివెళ్లి రాశారు. అలా సరితా జగాడే చదువుకోడానికి నామోషీ చెందలేదు. టెన్త్‌లో తనకి 44 మార్కులు రాగా- కుమార్తెకి 69 మార్కులు వచ్చాయి- అని ఎంతో సగర్వంగా అందరికీ చెబుతూ చదువుకోడం ఆపబోమని ప్రకటించింది.