Others

సాహిత్య సమాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* అవినీతి వ్యతిరేక కవితల పోటీకి ఆహ్వానం
దేశంలో శాంతి, అభివృద్ధి, సంరక్షణలకు అడ్డుగోడగా నిలుస్తున్న అన్ని రకాల అవినీతిపై కవితల పోటీ నిర్వహిస్తున్నట్లు గుంటూరుకు చెందిన అమరావతి సాహితీమిత్రులు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అవినీతిని ఖండిస్తూ విమర్శిస్తూ, దాని నిర్మూలనకు సూచనలిస్తూ కవితలు రాయాలని పేర్కొంది. ఆమ్‌ఆద్మీ పార్టీ, ఆంధ్రప్రదేశ్‌వారి సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ పోటీకి ఏ ప్రక్రియలోనైనా కవితలు పంపవచ్చు. ఒక కవి ఒక కవిత మాత్రమే పంపించాలి. ప్రథమ బహుమతిగా రూ.5000, ద్వితీయ బహుమతిగా రూ.3000, తృతీయ బహుమతిగా రూ.2000, ప్రత్యేక బహుమతుల కింద మరో ఆరు కవితలకు రూ.500 చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. కవితలు చక్కని వ్యక్తీకరణ, శిల్పం కలిగి ఉండాలి. న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయం. పద్యాలు, లఘు కవితలు ఆరు వరకూ పంపవచ్చు. వచన కవితలు, గేయాలు 24 పాదాలు మించకుండా ఉండాలి. కవితలను అక్టోబర్ 31వ తేదీలోగా పోస్టు లేదా కొరియర్ ద్వారా మాత్రమే పంపించాలి. చిరునామా: డా. రావి రంగారావు, 101, అన్నపూర్ణ నగర్ 5వ లైన్, గోరంట్ల, గుంటూరు - 522 034. అవినీతి వ్యతిరేక దినోత్సవమైన డిసెంబర్ 9న గుంటూరులో జరిగే కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందించనున్నట్లు నిర్వహకులు తెలిపారు. వివరాలకు 9247581825లో సంప్రదించవచ్చు.
నందిని సిధారెడ్డికి పల్లేరు స్వయంప్రభ స్మారక పురస్కారం
తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్, ప్రముఖ కవి డా. నందిని సిధారెడ్డికి ప్రతిష్టాత్మక రాష్టస్థ్రాయ పల్లేరు స్వయంప్రభ సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నెల 14న వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేస్తారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డా. అయాచితం శ్రీధర్ ముఖ్య అతిథిగా, ఆచార్య బన్న అయలయ్య, డా. టి.శ్రీరంగస్వామి, వరప్రసాద్, జావెద్, నిధి తదితరులు హాజరవుతారు.
కడియాల రామమోహన్‌రాయ్‌కు అద్దేపల్లి పురస్కారం
అద్దేపల్లి రామమోహనరావు కవిత్వ విమర్శ పురస్కారానికి ప్రముఖ సాహితీ విమర్శకులు డా. కడియాల రామమోహనరాయ్ ఎంపికయ్యారు. అద్దేపల్లి జయంతి సందర్భంగా సెప్టెంబర్ 6న కాకినాడలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు అద్దేపల్లి ఉదయ భాస్కరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి కొత్తపేట కళాసాహితి అధ్యక్షుడు గిడ్డి సుబ్బారావు అధ్యక్షత వహిస్తారు.