Others
వాల్ ఆఫ్ కైండ్నెస్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 26 August 2018
- బంగార్రాజు కంఠ, 8500350464

దయగల గోడ దగ్గర
దయాదాక్షిణ్యాలు
కొత్త ఊపిరిలోసుకుంటున్నాయ
మానవతా చివరి శ్వాస మీద
సమతా చివుళ్ళు మొలిపిస్తూ
తీరిన ఓ అవసరం
మరో అవసరంగా గోడ గుండెలమీద
రూపునే కాదు చూపునూ మార్చుకుంటుంది
అక్కడ కనపడేది
అరిగిన చెప్పులూ చిరిగిన బట్టలే కాదు
పరికించి చూసే మనసు కళ్ళకు
మరో ఆత్మానంద లోకం తాలూకు ఆనవాళ్ళు
స్వచ్ఛమైన నవ్వులుగా తొంగిచూస్తాయ
ముందుముందు ప్రతి గోడా
కాంక్రీటుతో పాటు కరుణను నింపుకుని
కాఠిన్యం కుత్తుకమీద కతె్తై
వేలాడుతున్న కొత్త కాశీ మజిలీలో
మనో కాలుష్య కాసారాలు ఇంకి
మానవత్వం మరో జనె్మత్తడం
కాల పరిణామ సిద్ధాంతంలో కొత్తకోణం
ప్రాణం లేని గోడ
పరోపకారానికి వేదికవుతున్నప్పుడు
ప్రాణమున్న మనిషి పొరుగువానికి
ప్రాణవాయువులూదడం ఏమంతపనీ!?