Others

30న ‘పెరటిచెట్టు’ పుస్కకావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వెయ్యేళ్ల తెలుగు సాహిత్య పరిచయం’గా మందలపర్తి కిషోర్ రాసిన ‘పెరటిచెట్టు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ నెల 30న విశాఖపట్నంలో జరగనుంది. క్రీ.శ. పదో శతాబ్దానికి చెందిన మల్లియ రేచన మొదలుకుని, పందొమ్మిదో శతాబ్దం చివర్లో జన్మించిన సురవరం ప్రతాపరెడ్డి వరకూ 80మంది సాహితీవేత్తల పరిచయ విశే్లషణలు ఈ పుస్తకంలో ఉన్నాయ. విశాఖలోని పబ్లిక్ లైబ్రరీలో జరిగే ఈ పుస్తక ఆవిష్కరణ సభకు ప్రముఖ కవి ప్రొ. చందు సుబ్బారావు అధ్యక్షత వహిస్తారు. సీనియర్ జర్నలిస్టు మానం ఆంజనేయులు, ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక, సాంస్కృతిక శాఖ సీయాఓ, ప్రముఖ నాటక రచయత డా. విజయభాస్కర్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. ప్రముఖ కవి అదృష్టదీపక్ ‘పెరటిచెట్టు’ను పరిచయం చేస్తారు. ఎస్. హనుమంతరావు, విరియాల గౌతమ్ తదితరులు హాజరవుతారు.
1న ‘మోహధూపం’ ఆవిష్కరణ
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శేషభట్టర్ రఘు రచించిన ‘మోహధూపం’ కవితా సంపుటి ఆవిష్కరణ సభ సెప్టెంబర్ 1న రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్‌లో జరుగుతుంది. ముఖ్యఅతిథిగా నందిని సిధారెడ్డి, సభాధ్యక్షులుగా కవి యాకూబ్, విశిష్ట అతిథిగా మామిడి హరికృష్ణ హాజరవుతారు. ఈ కార్యక్రమానికి సిద్ధార్థ, ఆడెపు లక్ష్మీపతి, ఎం.నారాయణశర్మ వక్తలుగా వ్యవహరిస్తారు.