Others

తూర్పు పడమరల వాన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తూర్పు పడమరల కలయక అసంభవం’ - ఒకనాటి మాట
తూర్పుకిటువైపు
పడమటకటువైపు
వేలాది మైళ్ల దూరాన్ని
కలిపిన ఒకే వాన
ఒకే కాలాన
సమాంతరంగా
మబ్బుల కుండలన్నీ ఢీకొని
ఉరిమి మెరిసి
పగిలి వర్షించి
ప్రాక్ పశ్చిమాకాశాలన్నీ
జలధారలతో
నేలమీది కాలాన్ని
నిర్నిద్ర సెల్‌ఫోన్ల సిగ్నల్స్‌ను
భూగోళ కొసలతో
వాణిజ్య వ్యాపార సూత్రాలన్నీ
ముడిపడి - చెల్లాచెదురై
విశ్వాసాలన్నీ తలకిందులై...!!
(న్యూజెర్సీలో ఉ.9 గం.కు, అదేరోజు హైదరాబాద్‌లో సా. 6.30 గం.కు ఒకే క్షణాన
ఏకధాటిగా తొమ్మిదిన్నర గంటల తేడాలోనే కురిసిన వర్షం)

- నిఖిలేశ్వర్, 9177881201