AADIVAVRAM - Others

దొంగ మల్లాది వెంకట కృష్ణమూర్తి స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శుక్ర, శని, ఆదివారాలు సెలవలు కావడం, పైగా శనివారం ఉగాది కావడంతో నిహాన్ తండ్రి తన కుటుంబ సభ్యులకి తిరుమలకి వెళ్లాడు. తిరుపతిలోని ఓ హోటల్‌లో బస చేసి శుక్రవారం కాళహస్తికి, కాణిపాకానికి వెళ్లారు. శనివారం తిరుమల వెళ్లి, ఆదివారం అలివేలు మంగాపురం, శ్రీనివాస మంగాపురం చూసి ఆదివారం రాత్రి మళ్లీ తిరుగు రైలు ఎక్కారు. సోమవారం ఉదయం ఇంటికి చేరాక నిహాన్ తల్లి పెట్టెని తెరిచి అందులోని బట్టలు బయటకి తీసే లోపలే నిహాన్ స్నానం చేసేసాడు.
‘నీకు టవల్ ఎక్కడిది?’ తల్లి అడిగింది.
‘హోటల్‌లోని టవల్‌ని తెచ్చాను. అదే వాడాను’
‘హోటల్ టవల్ తెచ్చావా?’ తల్లి నిర్ఘాంతపోతూ అడిగింది.
‘అవును. దాన్ని మన కోసం గదిలో ఉంచారు. కాబట్టి అది మనదేగా?’
‘కాదు. అది హోటల్ వాళ్లది. దాన్ని తీసుకురావడం దొంగతనం అవుతుంది’
‘ఆ టవర్ మీద హోటల్ పేరు ఎంబ్రాయిడరీ చేసి ఉంది. కాబట్టి ఆ హోటల్‌లో బస చేసిన గుర్తుకా తెచ్చాను’ నిహాన్ చెప్పాడు.
‘హోటల్ గదిలోని షాంపూ, సోప్‌లని తీసుకోవచ్చు. అవి కన్సూమబుల్స్ కాబట్టి. అంటే అవి మనం ఓసారి ఉపయోగించాక తిరిగి ఇంకెవరూ వాడరు. టవల్ మాత్రం డ్యూరబుల్. అంటే వాటిని ఉతికి మళ్లీ వినియోగిస్తారు. టవల్సే కాక దిళ్లు, దుప్పట్లు, టీవీ రిమోట్ లాంటివి కన్సూమబుల్స్ కావు’ నిహాన్ తల్లి వివరించింది.
‘ఇప్పుడేం చేయను? నేను దొంగిలిస్తున్నాను అని తెలీక తెచ్చాను’ నిహాన్ కొద్దిగా బాధగా ప్రశ్నించాడు.
‘సారీ చెప్తూ దాన్ని తిరిగి హోటల్‌కి పంపించడం ఒక్కటే చేసిన తప్పుని సరిదిద్దే దారి. నువ్వే హోటల్ మేనేజర్‌గా ఆ ఉత్తరం రాయి. కొరియర్‌లో పంపుదాం’ నిహాన్ తల్లి సూచించింది.
నిహాన్ వెంటనే ఆ టవర్ పట్టే అట్టపెట్టెని వెదికి తెచ్చి, అందులో దాన్ని ఉంచాడు. తను రాసిన ఉత్తరాన్ని తల్లికి చూపించి, ఆమె సంతృప్తి చెందాక అందులో ఉంచి టేప్‌తో అతికించి, ఆ పెట్టె పైన ఆ హోటల్ అడ్రస్ రాసిన కాగితాన్ని అతికించి, కొరియర్ పంపడానికి సిద్ధం చేశాక సంతోషంగా చెప్పాడు.
‘నా తప్పుని సరిదిద్దాను. నేను ఇప్పుడు దొంగని కాను’
వెన్ ఇన్ డౌట్, లీవ్ ఇట్ అవుట్