Others

మంజుశ్రీ స్వాత్మకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాత్మకథ
*
డాక్టర్ అక్కిరాజు రమాపతిరావు,
వెల: రూ.558/-
ప్రతులకు: నవోదయ,
ఇతర పుస్తక విక్రయ కేంద్రాలు.
*
ఆధునిక తెలుగు సాహిత్యంలో కథ, నవల, వ్యాసం వంటి వివిధ ప్రక్రియలలో తనదైన శైలిలో విశిష టస్థానాన్ని సంతరించుకున్న మహనీయుడు డా. అక్కిరాజు రమాపతిరావు. వీరు మంజుశ్రీ అనే కలం పేరుతో 1950వ దశకంనుండి పుంఖాను పుంఖంగా కథాసాహిత్యాన్ని వెలువరించారు. 2018లో గుంటూరులోని బొమ్మిడాల కృష్ణమూర్తి ఫౌండేషన్‌వారు మంజుశ్రీ సహస్ర చంద్రోదయ దర్శనవేళ ఒక బృహత్ గ్రంథాన్ని వెలువరించారు. ఈ పుస్తకం పేరు ‘స్వాత్మకథ’. ఇందులో మంజుశ్రీ శేమూషీ వైభవాన్ని వర్ణించే వివిధ రచయితల వ్యాసాలున్నాయి. అవి లోగడ ఆయా సందర్భాలలో వివిధ పత్రికలలో ప్రచురింప బడినవే. వాటినన్నింటినీ ఒక సంకలనంగా తీసుకొని వచ్చారు. ఇందులో మంజుశ్రీ వ్రాసిన వివిధ గ్రంథాలపై విశే్లషణ అనుశీలన సమీక్షలు కూడా ఉన్నాయి. మంజుశ్రీ ప్రధానంగా అభూత పూర్వ రచనాశైలిలో అనుభూతి కథలు రచించినవాడు. ముఖ్యంగా మధ్యతరగతి మందహాసాన్ని తన రచనలలో కథావస్తువుగా తీసుకున్నారు. జారుడుమెట్లు వంటి రచనలు వీరికి విశేషమైన కీర్తిప్రతిష్టలు సంతరించి పెట్టాయి. ఆంధ్రప్రదేశ్‌లోని సాహిత్య సాంస్కృతిక పునరుజ్జీవనంలో మంజుశ్రీ గణనీయమైన పాత్రను పోషించారు. జేష్ట శ్రేష్ట రచయితగా మంజుశ్రీ చేసిన సేవలను ఉపాయనంగా ఈ కృతి, సుకృతి వెలువడింది. మంజుశ్రీ ఎక్కువ కాలం హైదరాబాదులోని తెలుగు ఎకాడమీలో పనిచేశారు. ఆ తర్వాత కేంద్ర సాహిత్య ఎకాడమీకి కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అప్పుడు వారిని కొందరు వామపక్షీయులు సరిగ్గా పనిచేయనీయలేదు. ఐనా ఓర్పుతో భరించారు. ఈ సంకలనంలో 65 వ్యాసాలున్నాయి. కొన్ని చిన్నవి మరికొన్ని విశే్లషణాత్మకమైనవి. ఇంకొన్ని శుభాకాంక్షా సదృశమైనవి. దాదాపు అంతా లబ్దప్రతిష్ఠితులైన రచయితలు కవులు మంజుశ్రీ పట్ల తమకుగల మక్కువను ఎక్కువగా ఈ రచనలలో ప్రదర్శించారు.
అక్కిరాజు రమాపతిరావుగారు శతాధిక గ్రంథకర్త. ముఖ్యంగా కందుకూరి వీరేశలింగం పంతులు వంటివారి జీవిత చరిత్రలు రచించారు. ఏ రచన చేసినా చారిత్రక ప్రామాణ్యంలో ఉంటుంది. పరిశోధనాత్మకంగా విశే్లషణాత్మకంగా రచిస్తారు. ఇతడు ప్రాచీన ఆధునిక సాహిత్య సంప్రదాయాలకు సంధియుగంలోనివాడు. అందుకే ఆధునికతను సంతరించుకున్న సంప్రదాయ సౌరభాన్ని విసర్జించలేదు. ముఖ్యంగా జాతీయ భావాలుగల రచయిత. ఈ సంకలనం ప్రచురించి బొమ్మిడాలవారు కవి ఋణం తీర్చుకున్నారు.

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్