Others

మునగ ఒక్కటి చాలు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్ని వయసులవారూ, ముఖ్యంగా బాలలు ఫాస్ట్ ఫుడ్‌కి అలవాటుపడుతున్నారు. భారతదేశంలోని ఆరు ప్రధాన నగరాలలో సుమారు 20వేల మంది బడి పిల్లలపై చేసిన అధ్యయనంలో 25 శాతంమంది ఉండాల్సినదానికన్నా ఎక్కువ బరువు వున్నట్టు, 9 శాతంమంది స్థూలకాయులు వున్నట్టు తేలింది. దీనికి కారణం పోషకాహారం లోపించడమే.
పోషకాహార లోపాన్ని సరిదిద్దడానికి అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తుంటాం. ఇలా ఖర్చు చేసే బదులు మునక్కాడలు ఎక్కువ తినేట్టు చేస్తే పోషకాహార లోపాన్ని సులువుగా పరిష్కరించవచ్చు. పోషకాహార లోపాన్ని సరిదిద్దడానికి తినే ఆహారంలో పోషక పదార్థాలు వుండేట్టు చూడడానికి ములగ ఆకు, మునక్కాడలు ఎక్కువగా తినాలని నిపుణులు అంటున్నారు. ప్రపంచంలో పోషకాహార లోపాన్ని తరిమికొట్టడానికి మునగ ఒక్కటి చాలునని ఒక అంతర్జాతీయ సంస్థ తెలియజేసింది. ట్రీస్ ఫర్ లైఫ్ ఇంటర్నేషనల్ అనే సంస్థ 1980లో భారత్‌లో పండ్ల మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. మధ్యాహ్న భోజన పథకం కోసం కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతుంటాం. ఈ కార్యక్రమాన్ని అమలు చేసేవారు ప్రతి పాఠశాలలోనూ మూడు నాలుగు మునగ చెట్లు పెంచేట్టు చేస్తే బోలెడు డబ్బు ఆదా అవుతుంది. మునగకాడలు తిన్న విద్యార్థులలో పోషకాహార విలువలు ఎలా పెరిగాయో చెప్పగలిగితే వాస్తవం ఏమిటో మనకే తెలుస్తుంది.

- బి.మాన్‌సింగ్ నాయక్