Others

రోదసీ వీరుడి చిన్న కోరిక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతరిక్ష పరిశోధక కేంద్రం ‘మిర్’లో ఆరు నెలలు అధ్యయన రోదసీవాసం చేసిన ముగ్గురు అంతరిక్ష యోధులు పోయిన వారం ‘సోయజ్’ రాకెట్ మందసంలో క్షేమంగా భూమీద అవతరించారని తెలుసు కదా? అమెరికా ‘నాసా’కి చెందిన టిమ్ కొప్రా అమెరికాకి, రష్యాకి చెందిన కెప్టెన్ యూరి నూలెన్ చెంకో మాస్కోకి తిరిగిపోగా, బ్రిటీష్ రోదసీ వీరుడు ‘టిమ్ పీక్’ పశ్చిమ జర్మనీలోని కొలోన్ నగరానికి వెళ్లి, అక్కడ అమ్మా నాన్న, భార్యా, పిల్లల్ని కలుసుకున్నాడు. రోదసిలో నడక సాగించిన తొలి బ్రిటీష్ ఆస్ట్రోనట్‌గా రికార్డు స్థాపించిన టిమ్ పీక్ ఖజికిస్థాన్‌లో నేల మీదికి అడుగుపెడుతూనే- ‘మీ కోరిక ఏమిటి?’ అంటే, ‘ఓ పిజ్జా, దాంతోపాటే ఓ చల్లని బీర్‌కాయ దొరికితే బాగుణ్ను’- అన్నాడు నవ్వుతూ. కానీ, ఇరవై నాలుగు గంటలదాకా పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వం అన్నారు. పైగా ఇరవై రెండు రోజులు అన్ని రకాల టెస్ట్‌లు చేస్తేగానీ మామూలు మనుషుల్లోకి వదలరు. మామూలు తిండి తిననివ్వరు.
పదిహేడు వేల మైళ్ల వేగంతో రోదసీ మందసం భూమీదికి దూసుకొస్తూ- అంతలో భూమి వాతావరణంలోకి ప్రవేశించినపుడు ఒక్క ‘ఆరు నిమిషాల’పాటు, ఆ ఒత్తిడికి తట్టుకోవడం గురించి టిమ్ పీక్ ఒక అద్భుతమైన సంగతి చెప్పాడు. ‘‘పదిహేడు వేల మైళ్ల వేగం నుంచి గంటకి 500 మైళ్ల వేగానికి ‘సోయజ్’ మారినందువల్ల సదరు ఘర్షణకి లోపల 1600 ఫారిన్ హీట్ డిగ్రీల ఉష్ణోగ్రత ఏర్పడింది. రాకెట్ మందసం మల మల మాడిపోయింది. లోపల వున్న మేం ఎలా ఫీలయ్యామంటే- ఒక అగ్నిగోళంలో మమ్మల్ని బంధించి, దాన్ని నయాగరా జలపాతంలోకి విసిరేస్తే అది ఎలా క్రిందికి కొట్టుకుపోతుంది? అలాంటి అనుభూతి కలిగింది’’ అన్నాడు. ఒక అంతరిక్ష యోధుని రుూ భావనా పటిమ అందర్నీ ఆశ్చర్యపరిచింది. కాగా అతను ‘‘ఒక్క వాన పడితే బాగుణ్ణు’’ అన్న మాట, మనందరిపట్లా సానుభూతి చూపించినట్లు కాదా? ఒక్క ‘వాన’ అసంభవం అనుకుంటున్నాం.
పారేసే తిండి చేరేసుకున్నా తప్పే?
విందులు, వినోదాలు, పార్టీలు వగైరా అయిపోయాకా మిగిలిన తిండి పదార్థాలను అక్కడి ఉద్యోగస్తులు సర్దేకుని యిండ్లకు పట్టుకుపోతారు. కానీ సిడ్నీలోని మోస్మాన్ మ్యునిసిపిల్ కౌన్సిల్ వారు శ్రీమతి జెన్నా మెర్రిన్‌ని ‘‘తిండి దొంగవి నువ్వు’’ అని నిర్థారించి, నిర్దాక్షిణ్యంగా ఉద్యోగంలోంచి తీసిపారేశారు.
క్రిస్‌మస్ సందర్భంగా జరిగిన ఖరీదయిన విందులో మిగిలిపోయిన పదార్థాలలో చాలా ఖరీదయిన కోడి వంటకాలు గొడ్డు మాంసం పులుసులు- అవో పదిపేట్లు, యివో రెండు గినె్నలు యింటికి పట్టుకుపోయింది శ్రీమతి మెర్రిన్. ఆమె మున్సిపల్ కౌన్సిల్‌లో సూపర్‌వైజర్ హోదాలో పదహారు సంవత్సరాలుగా పనిచేస్తోంది.
‘‘నువ్వు కౌన్సిల్ సొమ్ములయిన వంటకాలని ఎత్తుకుపోయావు కనుక ‘డిస్‌మిస్’ అన్నారు. లబోదిబోమన్నదామె. ‘‘అవతల పారేసేవేకదయ్యా, నేను తీసుకున్నదీ? మంచివన్నీ ఫ్రిజ్‌లోనే సర్దేశాను’’ అని ఎంత మొత్తకున్నా ఆమె, వాళ్లు వినలేదు. ‘‘చికెన్ కర్రీ, బీఫ్ సూపు’’ అంటే మాటలా? అవి మేము రేపు ‘బార్ మిక్కూ’ (నిప్పుల మీద కాల్చి చేసే వంటకం) చేయిద్దామనుకున్నాం’’ అంటూ ఆమెని యింటికి పంపించేశారు.
ఆమె కోర్టుకి వెళ్లింది. ‘‘అవతల పారేసేబదులు నేను ఇంటికి, పిల్లలకోసం తీసుకుపోయాను. ఇది దొంగతనం కాదు. పైగా, నా సర్వీస్ ఎంతో చూడాలా? వద్దా?’’ అంటూ ‘ఉద్యోగుల సంక్షేమం కోర్టు’లో కేసు పెట్టింది. ‘‘నా ఉద్యోగం తిరిగి యిప్పించాలి’’ అనీ ధర్మప్రభువుల్ని (జడ్జీలు) అడిగింది. కేసు ఆరు మాసాలుగా రంజుగా సాగింది. ‘‘నేను వాటిని వీధులూడ్చే పనివారికి పెడదాం అనుకున్నాను’’ అన్న ఆమె వాదం కూడా చెల్లలేదు. పైకోర్టుకి వెళ్తాను అంటోంది శ్రీమతి మెర్రిన్- ఉద్యోగం కావాలిగా!